అన్వేషించండి

Daily Horoscope Today Dec 7, 2023 : మీ జీవిత భాగస్వామి మాటలను తేలికగా తీసుకోకండి, డిసెంబర్ 7, 2023 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. డిసెంబరు 06 , 2023 ఈ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...

 Daily Horoscope Today Dec 07, 2023

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రాశివారు వివాహం గురించి ఆందోళన చెందుతారు. వివాదాస్పద విషయాలపై మీ అభిప్రాయాన్ని నేరుగా బయటపెట్టేయవద్దు. కొత్తగా ప్రారంభించిన పిలో రిస్క్ తీసుకోవద్దు.  తయారీ రంగంలో ఉండే వ్యాపారవేత్తలు పెద్ద ఆర్డర్‌లను పొందుతారు. సంతానం గురించిన ఆందోళనలు తొలగుతాయి.

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

పనిలేని చర్చర్లో పాల్గొనకపోవడమే మంచిది. ఈ రాశి ఉద్యోగులకు వ్యతిరేకంగా కార్యాలయంలో రాజకీయాలు జరగొచ్చు. పని ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సన్నిహితులతో గడపడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడంపై శ్రద్ధ వహించండి.

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ రాశివారు పాత పొరపాట్లు తలుచుకుని పశ్చాత్తాపడతారు. కమీషన్ సంబంధిత పనులకు కొంత దూరం పాటించండి. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. మీ ఆలోచనలను వ్యక్తపరచడంలో మీకు అసౌకర్యం కలుగుతుంది.

Also Read: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఈ రోజు మీరు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేరు. ఆస్తి కొనుగోలు, అమ్మకం వలన అద్భుతమైన లాభాలు పొందుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాల విషయంలో మనసులో కొంత సందేహం ఉంటుంది. 

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు కొన్ని ప్రత్యామ్నాయ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొందరి పట్ల నమ్మకం లోపిస్తుంది. ప్రేమ సంబంధాలకు సంబంధించిన అపార్థాలు తొలగిపోతాయి. పూర్తి అంకితభావంతో పనిచేస్తారు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి.

Also Read: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. మీరు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయం సాధిస్తారు. వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు.

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రాశివారికి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఉద్యోగులు టార్గెట్లు రీచ్ అవడంతో అధికారులను మెప్పించలేరు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇదే మంచి సమయం.  అపరిశుభ్రమైన ఆహారపు అలవాట్ల వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు రావొచ్చు. కొత్త భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రోజు ప్రారంభం మీకు చాలా బాగుంటుంది. కార్యాలయంలో మీ హక్కులు పెరుగుతాయి. ప్రేమ సంబంధాల్లో సంతోషం ఉంటుంది. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి సలహాలు పాటించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశి ఉద్యోగులు బదిలీలు పొందే అవకాశం ఉంది. శత్రువులను అధిగమిస్తారు. మీ సంభాషణ ద్వారా అందర్నీ ఆకట్టుకుంటారు.  ముఖ్యంగా బ్యాంకింగ్‌ నిపుణులకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది.  ప్రేమ సంబంధాలకు కుటుంబ ఆమోదం లభించే అవకాశం ఉంది.

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

వ్యాపార లావాదేవీలకు సంబంధించి కొంత గందరగోళం ఏర్పడవచ్చు. మీ ఆలోచనలను స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వడం తగదు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు కోపంగా ఉండవచ్చు. పాత చింత కారణంగా కొంత చికాకుగా అనిపిస్తుంది. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులుంటాయి.

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఈ రోజు మీరు కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. వివాహేతర సంబంధాలకు దూరం పాటించండి. మారుతున్న వాతావరణంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.  మీ జీవిత భాగస్వామి మాటలను తేలికగా తీసుకోకండి. మీరు మానసికంగా చాలా బలహీనంగా అనిపించవచ్చు. మీరు ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Also Read: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశివారు ఈ రోజు సవాలుతో కూడిన పని పొందే అవకాశం ఉంది. వాతావరణం కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. రక్తపోటు రోగులు ఒత్తిడికి దూరంగా ఉండాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండకండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget