చాణక్యనీతి: పాలకుడు ఇలా ఉంటే ప్రజలు పక్కనపెట్టేస్తారు!



నిర్థనం పురుషం వేశ్యాం ప్రజా భగ్నం నృపాం త్యజేత్
ఖగాః వీతఫలం వృక్షం భుకత్వా చాభాగతో గృహమ్



ఏ వస్తువులను అయినా, మనుషులను అయినా ఉపయోగానంతరం విడిచిపెట్టేస్తారన్నది చాణక్యుడి భావన



ధనాన్ని పొగొట్టుకుంటే పురుషుడిని వెలయాలు వదిలేస్తుంది



అప్పటివరకూ ప్రేమ నటించి ప్రదర్శించిన వెలయాలు..ఆ వ్యక్తి దగ్గర ధనం లేదని తెలిసి విముఖత చూపిస్తుంది



రాజు లేదా పాలకుడు.. శక్తి హీనుడు అయితే ప్రజలు పట్టించుకోవడం మానేస్తారు



గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న పాలకుడిని ప్రజలు పక్కనపెట్టేస్తారు



పళ్లు, కాయలు ఇవ్వని చెట్లను పక్షులు విడిచిపెట్టేసి వెళ్లిపోతాయి



భోజనానికి ఇంటికి వచ్చిన అతిథి.. భోజనం చేసిన తర్వాత ఈ ఇంటికి విడిచిపెట్టి వెళ్లిపోతాడు



తమ తమ పనులు నెరవేర్చుకోవడం పూర్తైపోతే ఎవరు ఎవరితోనైనా సంబంధం తెంచుకుని వెళ్లిపోతారు Images Credit: Pinterest