2023 డిసెంబరు (మార్గశిరమాసం) లో ముఖ్యమైన రోజులివే!



మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమని పేరు.



శ్రీ కృష్ణ పరమాత్ముడు గీతబోధనలో భాగంగా మార్గశిర మాసం స్వయంగా తానే అన్నాడు.



మార్గశిర శుద్ద పంచమి రోజు నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజ ఇది



డిసెంబరు 18న మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.



మార్గశిర శుద్ద సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేస్తే అన్నీ శుభఫలితాలే



డిసెంబరు 20 మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుందంటారు



మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతారు.



వైకుంఠ ఏకాదశి రోజే గీతా జయంతి జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ణాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినం రోజు అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించింది ఇదే రోజు



మార్గశిర ద్వాదశి అఖండ ద్వాదశి, మార్గశిర శుద్ద త్రయోదశి రోజు హనుమంతుడి భక్తులు ఆంజనేయుడి వ్రతం ఆచరిస్తారు



మార్గశిర శుద్ద పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి. మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మ రాజుకి నమస్కరిస్తే సంపూర్ణ ఆయుష్షు లభిస్తుందంటారు



ఈ నెలలోనే ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కుటంబలో ఆనందం వెల్లివిరుస్తుంది. Images Credit: Pinterest