భర్తకి భార్య ఎడమవైపే ఎందుకు ఉండాలి! హిందూ సంప్రదాయం ప్రకారం..భర్తకి భార్య ఎప్పుడూ ఎడమవైపు మాత్రమే ఉండాలని చెబుతారు బ్రహ్మ మనిషిని రూపొందించేటప్పుడు తనలో కుడి భాగాన్ని పురుషుడిగా గా, ఎడమ భాగాన్ని స్త్రీ గా సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహా విష్ణువు శ్రీ మహాలక్ష్మీని ఎడమ స్థానంలో ఉంచితే..అర్థనారీశ్వరడు శరీరంలో ఏడమభాగాన్ని పార్వతికి ఇచ్చేశాడు శరీరాన్ని నిలువుగా రెండు భాగాలు చేస్తే కుడివైపు బలంగా ఉంటుంది..ఎడమవైపు కుడివైపు కన్నా అల్పంగా ఉంటుంది కుడివైపు ఉన్న ప్రతి భాగం ఎడమవైపు ప్రతిభాగం కన్నా ఎంతోకొంత బలంగా ఉంటుంది. కుడి సూర్య భాగం..ఎడమ చంద్రభాగం..అంటే కుడివైపు సూర్యనాడి-ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది కుడి-ఏడమకు ఇంత శక్తి ఉంది కాబట్టి సూర్యనాడిగా పురుషుడిని- స్త్రీని చంద్రనాడిగా చెబుతారు భార్య సంపూర్ణ క్షేమాన్ని,యోగాన్ని, ఆమె పోషణను భరించే భర్త కుడివైపు.. భర్తకు సహకరిస్తూ నీ బలం తగ్గకుండా జాగ్రత్తగా చూసుకుంటానని భార్య ఎడమవైపు ఉంటారు Image Credit: Pinterest