జాతకంలో రాహువు బాలేకపోతే చాలా నష్టం జరుగుతుందని అనుకుంటారు. కానీ కొన్ని మంచి పనులు, కొన్ని రకాల దానాలు చెయ్యడం, దయగా ఉండడం వల్ల రాహుప్రభావం తగ్గుతుంది. రాహువు వల్ల కలిగే నష్టాన్ని నివారించే పరిహారాల గురించి తెలుసుకుందాం. అమావాస్య రోజున దేవాలయంలో నాలుగు కొబ్బరికాయలను దానం చెయ్యాలి. ప్రవహించే నీటిలో కొబ్బరి కాయను వదలాలి. అవసరంలో ఉన్న వారికి అన్నదానంతో పాటు నీలం రంగు దుస్తులను దానం చేస్తే రాహువు ప్రసన్నం అవుతాడు. అంధులకు అన్నదానం చెయ్యడం వల్ల కూడా రాహువు సంతుష్టి చెందుతాడు. వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం, లేదా కుక్కలను ప్రమాదం నుంచి కాపాడడం వాటికి సేవ చెయ్యడం ద్వారా కూడా రాహువు కృపను పొందవచ్చు. పక్షులకు నల్లని గింజలను దానాగా వెయ్యడం వల్ల నెగెటివిటి పోతుంది. ఏనుగులకు అరటిపండు తినిపించడం ద్వారా రాహువు వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. All Images Credit: Pexels