2023 కార్తీకమాసం ఎప్పటితో ఆఖరు!



డిసెంబరు 12 కార్తీక అమావాస్య... డిసెంబరు 13 కార్తీకమాసం చివరిరోజు పోలిస్వర్గం



కార్తీకమాసం నెలరోజుల పాటూ నియమంగా పాటించినవారు...అమావాస్య మర్నాడు..మార్గశిర మాసం మొదటి రోజు అయిన పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు..



ఆ రోజుతో కార్తీకమాసం పూర్తైనట్టు. ఆ రోజునే పోలిపాడ్యమి లేదా పోలిస్వర్గం అంటారు



ఈ రోజున అరటిదొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు



కార్తీకం నెలరోజులూ దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ ఒక్కరోజు 30 ఒత్తులతో దీపాన్ని అరటి దొప్పల్లో వదిలితే నెలరోజులూ చేసిన పుణ్యం దక్కుతుంది



ఇదే రోజు బ్రాహ్మణులకు దీపదానం చేయడం పుణ్యఫలం



పంచభూతాల్లో ఒకటైన అగ్ని అనే జ్యోతి స్వరూపాన్ని..పంచభూతాల్లో మరొకటైన నీటిలో వదలుతున్నారు



అంటే ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే దీని వెనుకున్న ఆంతర్యం.



పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే...



పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతారని పండితులు చెబుతారు
Image Credit: Pinterest