క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారో తెలుసా!



కార్తీక శుద్ద ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి మేల్కొంటాడు..అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు.



ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.



యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజు శ్రీ మహాలక్ష్మితో కలసి భూలోకానికి వస్తాడట.



అందుకే శ్రీ మహావిష్ణువు కొలువైన ఉసిరికి...శ్రీ మహాలక్ష్మి ఉండే తులసికి కళ్యాణం జరిపిస్తారు.



వాసుకుని తాడుగానూ, మందర పర్వతాన్ని కవ్వంగానూ చేసుకుని ఈరోజునే రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు. కాబట్టి చిలుకు ద్వాదశి అని పిలుస్తుంటారు.



క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు.



పాలకడలి నుంచి వచ్చిన శ్రీమహాలక్ష్మి ఈ రోజు శ్రీ మహా విష్ణువును వివాహం చేసుకుంటుంది. అందుకే లక్ష్మీదేవిని క్షీరాబ్ది కన్యక అంటారు.



అందుకే క్షీరాబ్ధి ద్వాదశి రోజు లక్ష్మీ స్వరూపమైన తులసికి..విష్ణు స్వరూపం అయిన ఉసిరికి కళ్యాణం జరిపిస్తారు..
Image Credit: Pinterest