జ్వాలా తోరణం కింద నుంచి ఎందుకు దాటాలి!



కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి మరింత విశిష్టత ఉంది.



శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పెట్టి ఓ కర్రను అడ్డంగా వాటిపై పెట్టి.. ఎండుగడ్డిని తోరణంలా కడతారు. దీనిని యమద్వారం అంటారు.



ఈ గడ్డిపై నెయ్యిపోసి మంట వెలిగిస్తారు..ఆ జ్వాల కిందనుంచి పరమేశ్వరుడిని పల్లకిలో మూడుసార్లు ఊరేగిస్తారు.



మరణానంతరం యమలోకంలో అడుగుపెట్టిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం.



యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి అగ్ని తోరణం గుండానే లోపలకి అడుగుపెడతారట.



పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష ఇదే అని..ఈ శిక్షను తప్పించుకోవాలంటే పరమేశ్వరుడిని ప్రార్థించడం ఒక్కటే మార్గం అంటారు.



కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటూ వెళ్ళి వస్తారో వారికి యమలోకంలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉండదు



జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిచే అవకాశం వస్తే..



శివా..ఇప్పటి వరకూ చేసిన పాపాలు ఈ మంటల్లో కాలిపోవాలి..ఇకపై ఎలాంటి తప్పుచేసే పరిస్థితి రాకుండా సన్మార్గంలో నడిచేలా చేయమని నమస్కరించాలి. Image Credit: Pinterest