మహిళలు మాత్రమే పాతివ్రత్య నియమాలు పాటించాలా! ధర్మశాస్త్రంలో పాతివ్రత్య నియమాలన్నీ మగవారు రాశారు కాబట్టి స్త్రీలకు మాత్రమే నియమాలు పెట్టారా అనే సందేహం చాలామందిలో ఉంది పురుషుడిని బీజంగా, స్త్రీని క్షేత్రంగా చెబుతారు స్త్రీ ఒక వంశ పురోగాభివృద్ధికి తోడ్పడుతుంది స్త్రీ ఒక వంశం నిలబడటానికి సహకరిస్తుంది స్త్రీ ఒక వంశం ఉత్తమ గతులను పొందటానికి తోడ్పడుతుంది ఎప్పుడైతే ఒక స్త్రీ తన వంశంలో యోగ్యుడైన కుమారుడికి జన్మనిచ్చిందో పితృదేవతానుగ్రహం చేత వంశం వృద్ధి చెందుతుంది పురుషుడి తప్పిదం వల్ల ఒక వంశానికి వచ్చే సమస్య చాలా తక్కువ..కానీ.. స్త్రీ తప్పు చేస్తే ఆ వంశంపై పడే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వంశం నిలబెట్టేందుకు ప్రధాన కారకురాలు స్త్రీ..అందుకే ఆమెకు మాత్రమే పాతివ్రత్య నియమాలు పెట్టింది ధర్మశాస్త్రం మనుస్మృతిలో ప్రస్తావించిన విషయాలివి... Images Credit: Pixabay