కార్తీక పౌర్ణమికి ఇంత విశిష్ట‌త ఉందా!



వేదాల‌ను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినది కార్తీక పౌర్ణమినాడే



పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించింది కూడా పౌర్ణమిరోజునే కావడంతో దీనికి త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు



దేవదీపావళి , కైశిక పౌర్ణమి, జీటికంటి పున్నమి, కుమార దర్శనం అనే పేర్లతో కూడా పిలుస్తారు.



కార్తీక పౌర్ణమి రోజు కొన్నిచోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు.



తమిళనాడు తిరువణ్ణామలైలో జ్యోతిస్వరూపుడై వెలిసిన శివుడి అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వేలమంది భక్తులు తరలివెళతారు



కార్తీక పౌర్ణమిరోజు వెన్నెలలో పాలుకాస్తే ఆ పాలు అమృతతుల్యం అవుతాయని విశ్వాసం.



కార్తీక పౌర్ణమిరోజు ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతోపాటు దానికి అతిచేరువలోనే దేవతల గురువైన బృహస్పతి (గురుగ్రహం) కూడా ఈరోజున సాక్షాత్కరిస్తుందట.



ఆ గురుశిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.



పౌర్ణమిరోజు ప్రాతఃకాలంలో దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే ఆ దంపతులు శివ,కేశవులు ఇద్దరి అనుగ్రహానికి పాత్రులువుతారు. Image Credit: Pinterest