మంగళవారం తెలిసో తెలియకో కొన్ని పనులు చేస్తాం. కానీ, వాటివల్ల చాలా నష్టపోతం. అంగారక గ్రహాధిపతి. ఉష్ణగ్రహం కనుక త్వరగా కోపం తెప్పిస్తుంది. రక్త సంబంధ అంశాల మీద ప్రభావం ఉంటుంది. మంగళవారం కొన్ని పనులు చెయ్య కూడదని జ్యోతిషం చెబుతోంది. అవేమిటో తెలుసుకుందాం. మంగళవారం గోళ్లు, జుట్టు కత్తిరించకూడదు. క్షవరం చేసుకోవద్దు. మినపప్పు శనికి సంబంధించినది కనుక మంగళవారం రోజున మినపపప్పుతో చేసే పదార్థాలు వండకూడదు. మీకంటే పెద్దవారైన సోదరులతో వాగ్వాదానికి, గొడవకు దిగకూడదు. మంగళవారం నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. భూమి తవ్వే కార్యక్రమాలు కూడా మంగళవారం రోజున చెయ్యకూడదు. మేకప్, పూజా సామాగ్రి, నల్లరంగు వస్త్రాలు, ఇనుప వస్తువులు మంగళ వారం రోజున కొనకూడదు. Representational Image : Pexels