Chanakya Niti: జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ తప్పులు చేయకూడదు!
Chanakya Niti: ఒక వ్యక్తి విజయం సాధించాలంటే, కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం విజయం సాధించాలంటే ఏం చేయాలి.?
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకడిగా పేరొందాడు. నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త, వ్యూహకర్త మాత్రమే కాకుండా, అతను ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు. జీవితంలోని ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి చాణక్యుడు సూచించిన నియమాలను అనుసరించేావారెందరో. వ్యక్తిగత జీవితం నుంచి పని, వ్యాపారం, మానవ సంబంధాల వరకు అన్ని అంశాలపై స్పష్టతనిస్తుంది. ముఖ్యంగా జీవితంలో విజయం సాధించాలంటే ఓ వ్యక్తి ఏ విషయాలు ఫాలో అవ్వాలో తన శిష్యులకు బోధించాడు ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆ అంశాలు ఏంటో తెలుసుకుందాం.
మీ బలహీనతలను చెప్పకండి
ఒక వ్యక్తి తన సమస్యలను లేదా అతని బలహీనతలను ఇతరులకు చెప్పకూడదని పేర్కొన్నాడు ఆచార్య చాణక్యుడు. మన బలహీనతలను ఇతరులకు చెప్పడం మన బాధలకు దారి తీస్తుంది. లేదా మీరు మీ బలహీనతలను చెప్పే వ్యక్తి వాటిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. ఈ కారణంగా మీ బలహీనతలు, సమస్యల గురించి ఇతరులకు ఎప్పుడూ చెప్పవద్దు.
Also Read : చాణక్య నీతి ప్రకారం మీ బంధం పదిలంగా ఉండాలంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.!
తెలివిగా ఖర్చు పెట్టండి
ఒక వ్యక్తి ఎల్లప్పుడూ భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అందువల్ల, ఇంట్లో సంపదను కూడబెట్టుకోవడం చాలా ముఖ్యం. మీ డబ్బును ఎల్లప్పుడూ చాలా ఆలోచనాత్మకంగా ఖర్చు చేయండి. వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి.
మూర్ఖులతో వాదన వద్దు
తెలివితక్కువ వ్యక్తులతో ఎప్పుడూ వాదించవద్దు ఇలా చేయడం వల్ల మీకు హాని కలుగుతుంది. అంతేకాకుండా, ఇది మీ వ్యక్తిత్వంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఇతరుల దృష్టిలో మీరు చెడ్డవారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూర్ఖులతో వాదించే బదులు వారిని వదిలేయండి. ఎందుకంటే అదే విషయం ఎంత చెప్పినా వాళ్లకు పట్టదు.
అలాంటి వారిని నమ్మవద్దు
మీ మాటలను పట్టించుకోని వ్యక్తులు విశ్వసించదగినవారు కాదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మిమ్మల్ని బాధలో చూసి ఆనందించే వ్యక్తులను మీరు ఎప్పుడూ నమ్మకూడదు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా మోసం చేస్తాడు. కాబట్టి మీరు అందరితో పంచుకోగలిగే ఆలోచనలను మాత్రమే వారితో పంచుకోండి. మీ ఆలోచనలన్నింటినీ వారితో పంచుకోవద్దు.
Also Read : తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు ఎందుకు - దీనిపై చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా!
లక్ష్యం బహిర్గతం చేయవద్దు
మీ లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. దీని కారణంగా వ్యక్తులు మీ లక్ష్య సాధనకు అడ్డంకులు సృష్టించవచ్చు. చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి విజయం అతని కృషి, వ్యూహం, సమయపాలనపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ లక్ష్యం గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారు దానిని దుర్వినియోగం చేయవచ్చు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.