అన్వేషించండి

Chanakya Niti: చాణ‌క్య నీతి ప్ర‌కారం మీ బంధం ప‌దిలంగా ఉండాలంటే ఈ విషయాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.!

Chanakya Niti: మాన‌వ‌ సంబంధాలు బాగుండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మంచి సంబంధం కొన‌సాగించాలంటే ఎలాంటి ఆలోచనలు పాటించాలో ఆచార్య చాణ‌క్యుడు త‌న చాణ‌క్య నీతిలో తెలిపాడు.

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మాన‌వ‌ సంబంధాల గురించి అనేక విష‌యాలను ప్ర‌స్తావించాడు. ఈ రోజు లేదా రేపు సంబంధంలో సమస్యలు రావ‌డం స‌హ‌జం. ఆ సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తి మాత్రమే సంసారం అనే సాగర తీరానికి చేరుకోగలడని అంటారు. అదే విధంగా, మంచి సంబంధం కలిగి ఉండాలంటే, కొన్ని విష‌యాల‌ను మ‌న‌లో ఇముడ్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు. మన సంబంధాల్లో గొడ‌వ‌ లేదా సమస్యను ఎదుర్కొన్నప్పుడు చాణక్యుడి ఆలోచనలను గుర్తుంచుకోవాలి. అవి ఏంటో తెలుసా?

1. నమ్మకం, గౌరవం
ఏదైనా సంబంధం నమ్మకం, గౌరవం మీద ఆధారపడి ఉంటుంద‌ని ఆచార్య‌ చాణక్యుడు తెలిపాడు. తన భాగస్వామిని గౌరవించని వ్యక్తితో వారి సంబంధం ఎక్కువ కాలం నిలిచి ఉండదు. సమాజంలోని ఏ వ్యక్తినైనా పదే పదే అవమానిస్తే వారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని, అదే విధంగా మీ సంబంధంలో కూడా స్త్రీ లేదా పురుషులను దూషిస్తే ఆ బంధం ఎక్కువ కాలం ఉండదని ఆచార్య చాణక్యుడు స్ప‌ష్టంచేశాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇతర ఉన్నత స్థాయి వ్య‌క్తుల‌ ముందు మీ సంబంధాన్ని ఎప్పుడూ గొప్ప‌గానే ఉండేలా చూసుకోవాల‌ని సూచించాడు.

Also Read : ఈ ఐదుగురిని గౌరవిస్తే ధన ప్రవాహం ఖాయం అన్న చాణక్యుడు!

2. అహం
చాణక్య నీతి ప్రకారం, అహంభావం ఉన్న సంబంధంలో అపోహ‌లు, ప‌ట్టింపులు రావడం సహజం. అహంభావం కారణంగా, సంబంధాల ప్రాముఖ్యత కోల్పోవడం ప్రారంభమవుతుంది, దాని కారణంగా ఉద్రిక్తత కూడా తలెత్తుతుంది. సంబంధాలలో అహాన్ని చూప‌డానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అహంభావం వల్ల సన్నిహిత సంబంధాలు తమ విలువలను కోల్పోతున్నాయని చాణక్యుడు చెప్పాడు.

3. సోమరితనం
సోమరితనం మనిషికి అతి పెద్ద శత్రువు అని మీరు చాలా పుస్తకాల్లో చదివి ఉంటారు లేదా విని ఉంటారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. చాణక్యుడి ప్రకారం, సోమరితనం లేదా ఆశయం లేని వ్యక్తుల నుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. అలాంటి వారి ప్ర‌భావం మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది లేదా మిమ్మల్ని వారిలాగే సోమరిపోతుగా చేస్తుంది. సోమరితనం అల‌వ‌డిన వ్య‌క్తి జీవితంలో ఏదైనా సాధించాలని కోరుకోడు. సోమ‌రులు త‌మ  ఇష్టానుసారంగా ప్రవర్తిస్తార‌ని ఆచార్య చాణక్యుడు తన చాణ‌క్య‌ నీతిలో పేర్కొన్నాడు.  

Also Read : డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలన్న చాణక్యుడు!

పురుషుడైనా, మ‌హిళ అయినా ఏ వ్య‌క్తి అయినా పైన పేర్కొన్న అంశాలను మనస్సులో ఉంచుకుని, ఇలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా శ్రద్ధ వహిస్తే, వాది సంబంధం ఖచ్చితంగా మెరుగుపడుతుంద‌ని ఆచార్య చాణక్యడు స్ప‌ష్టంచేశాడు.     

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget