Tirupati: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
Annual Brahmotsavams from June 02 to June 10: తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 02 నుంచి జూన్ 10వ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి..అందుకు సంబంధించిన వివరాలు

Sri Govindaraja Swamy Temple in Tirupati: తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 02 నుంచి జూన్ 10వ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మే 27 సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు TTD తిరుపతి జెఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం. త్వరితగతిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
వాహనసేవల సమయంలో గాంధీ రోడ్డు, కర్నాల వీధుల్లో అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లు తొలగించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ప్రధాన రహదారుల్లో ఆర్చీలు, స్వామివారి వాహనసేవలను భక్తులు చూసేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్ లు ఏర్పాటుచేయాలన్నారు.
ఆలయం, పరిసర ప్రాంతాలను పూలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించాలని చెప్పారు.
తగినంత మంది శ్రీవారి సేవకులతో క్యూలైన్ల క్రమబద్ధీకరణ చేపట్టాలన్నారు.
గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం, వాహన సేవల సమయంలో మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు.
రథోత్సవం రోజు భక్తులకు పానకం అందించాలని జేఈవో సూచించారు
వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, కేరళ డ్రమ్స్, జానపద నృత్యం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాలని సూచించారు
ఎండకు, వానకు భక్తులకు ఇబ్బందులు లేకుండా పందిళ్లు వేయాలని, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వాహనసేవలను ప్రసారం చేయాలని ఆదేశించారు
పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగ్గా ఉంచాలని.. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించి మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
భద్రతాపరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటుచేయాలని భద్రతాధికారులను కోరారు.
గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారు ఆదిశేషునిపై శయనించి ఉన్నట్టు దర్శనమిస్తారు. శిరస్సు దక్షిణ దిక్కున , ఉత్తరదిక్కున పాదాలు ఉంచి శంఖు చక్రాలతో చతుర్భుజుడై నాభికమలంలో బ్రహ్మ దేవుడితో దర్శనమిస్తారు స్వామివారు. శిరస్సున కిరీటం ధరించి ఆదిశేషుడు ఛత్రంలా ఉండి నీడనిస్తుండదా శ్రీ భూదేవేరులు పాదసేవ చేస్తున్నట్లుగా ఉంటారు. చిదంబరంలో శ్రీమహావిష్ణువుకు అనుసరించే పూజా విధానమే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారికి కూడా జరిగేలా నియమాలు ఏర్పాటు చేశారు శ్రీ రామానుజులు. ఫాల్గుణమాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో శ్రీగోవిందరాజస్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని చెబుతారు. వీర నరసింహ రాయలవారి రాణి శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయంలో అఖండ దీపం వెలిగించేందుకు 32 గోవులు సమర్పిస్తూ ఒక దానశాసనం వేశారు. 1239లో ఈ రాయలరాణి పైడిపల్లి గ్రామాన్ని ఆలయాలకు సమర్పిస్తూ ఆ గ్రామ ఆదాయం సగభాగం తిరుమల శ్రీవారి ఆలయ అభివృద్ధికి, మిగిలిన సగభాగం గోవిందరాజస్వామివారికి సమర్పించినట్టు శాసనంలో ఉంది.
తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!
రుమల అలిపిరి మెట్లదారిలో ఈ అద్భుతాలను గమనించారా..మీరెన్ని చూశారు
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















