అన్వేషించండి

Shani Vakri 2025: వక్రమార్గంలో శని సంచారం అంటే ఏంటి? 2025లో ఏ రాశిలో వక్రంలో ఉంటుంది..ఆ ప్రభావం ఈ మూడు రాశులపైనే ఉంటుందా!

Transit Shani Vakri July 2025: ఈ ఏడాది శని మీన రాశిలో వక్రీభవనం చెందుతున్నాడు. కొన్ని రాశులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు అవసరం

Shani Vakri 2025

శని వక్రీభవించడం వల్ల ఏం జరుగుతుంది?

మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా?

శని గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. 
 
2025 సంవత్సరంలో శని గమనంలో మార్పు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ ఏడాది శని వక్రసంచారం కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.  

శనిదేవుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. హిందూ పంచాంగం ప్రకారం శని  2025 జూలై 08న  వక్రీభవిస్తాడు. 2025 నవంబర్ 26న తిరిగి సాధారణ స్థితికి వస్తాడు. శని వక్రంలో సంచరించేసమయంలో బాహ్యపరీక్షకాదు..అంతర్గత పరీక్షా సమయం. 
 
ప్రస్తుతం శని మీన రాశిలో సంచరిస్తున్నాడు..అది  జ్ఞాన కారకుడైన దేవగురు బృహస్పతి రాశి. ఈ ప్రభావం కొన్ని రాశులపై మానసికంగా ,  భావోద్వేగపరంగా ఉండబోతోంది.

ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి
 
2025 మార్చి నుంచి శని మీనంలో సంచరిస్తున్నాడు. మీనంలో సంచారం వల్ల మీనంతో పాటూ మేషం, కుంభ రాశులవారికి ఏల్నాటి శని ఉంది. తిరోగమన దశలో శని ఉన్నప్పుడు ఈ మూడు రాశులవారు జాగ్రత్తవహించాలి. 
 
మేష రాశి

మేష రాశివారిపై  శని ప్రత్యేక దృష్టి ఉంది.. 2025 మార్చి 29 నుంచి ఏల్నాటి శని ప్రారంభమైంది.  మొదటి దశ కష్టకాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆరోగ్యం  , ధనం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వివాహం కానివారికి మరింత ఆలస్యం అవుతుంది. విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఆశించిన ఫలితాలుపొందలేరు. కీలకపత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తపడండి.

కుంభ రాశి

2025 మే 27 మీకు ప్రత్యేకమైన రోజు.. ఈ రోజు శని జయంతి ఈ రోజురోజు శనికి నూనె వెలిగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుంభ రాశిపై సాడేసాతి చివరి దశ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఉన్న కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శని లాభదాయక స్థితిలోకి వచ్చాడు..మీకు మంచి రోజులు మొదలవుతాయి.  

మీన రాశి

మీకు ఏల్నాటి శని రెండో దశ ప్రారంభమైంది. ఈ సమయంలో ఉద్యోగులు పనివిషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. క్షమశిక్షణ అవసరం. కోర్టుకేసుల్లో చిక్కుకున్నవారు వాటినుంచి ఇప్పట్లో బయటపడలేరు. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఆర్జించలేరు. జూలై నుంచి సెప్టెంబరు మీకు సవాళ్ల కాలంగా ఉంటుంది. 
 
శనిని ప్రసన్నం చేసుకునే ఉపాయాలు

శనివారం రావిచెట్టుకి పూజచేసి ఆవనూనె దీపం వెలిగించండి

ఓం శం శనిశ్చరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి

నల్ల నువ్వులు, ఇనుము దానం చేయండి

హనుమంతు చాలీసా మరియు శని స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి

శని వక్ర సంచారం ఎప్పుడు?
2025 జూలై 08 న శని వక్రసంచారం మీనంలో ప్రారంభమవుతుంది. 2025 నవంబర్ 26న వక్రం పూర్తవుతుంది
 
ఈ సమయంలో ఏ రాశులపై శని ప్రభావం అధికంగా ఉంటుంది?
కుంభం, మీనం , మేష రాశులకు ఎల్నాటి శని కొనసాగుతోంది..ఈ రాశులపై అధిక ప్రభావం ఉంటుంది
 
అష్టమ, అర్ధాష్టమ శన ప్రభావం ఏ రాశులపై ఉంది?
సింహ రాశిపై అష్టమ శని ప్రభావం, ధనస్సు రాశివారిపై అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది
 
వక్రంలో శని సంచారం అశుభమా?
కర్మలకు త్వరగా ఫలితాన్నిస్తాడు శని భగవానుడు.. తప్పులు చేయకుండా ఉంటే చాలు..మీకు మంచే జరుగుతుంది
 
శని ప్రభావం తగ్గించుకునేందుకు ఏం చేయాలి?
రావిచెట్టు పూజ, శని మంత్ర జపం  సేవ అత్యంత ప్రభావవంతమైనవి

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget