అన్వేషించండి

ఆలయంలో దర్శనం తర్వాత కూర్చున్నప్పుడు చదవాల్సిన శ్లోకం ఇది!

Temple: భ‌గ‌వంతుని దర్శనం కోసం ఆలయాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువే. సాధారణంగా దర్శనం తర్వాత కాసేపు కూర్చోవాలి అంటారు. ఇలా ఎందుకు కూర్చోవాలి? ఆ సమయంలో ఏం చదువుకోవాలి? 

Spirituality: భగవంతుడి సన్నిధికి వెళ్లినపుడు కళ్లారా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత కాసేపు ఆలయ ఆవరణలో కూర్చుంటారు. ఆ సమయంలో మన జీవిత సారాంశాన్ని తెలియజేసే శ్లోకాన్ని పఠించాలని గ్రంధాల్లో స్పష్టంగా ఉంది. ఈ శ్లోకాన్ని పఠించడం, దాని అర్థం తెలుసుకోవడం వల్ల మిమ్మల్ని కలవరపర్చే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.  

 అనాయాసేన మరణం, బినా దేన్యేన జీవనం 
దేహంత్ తవ సానిధ్యం, దేహి మే పరమేశ్వరం 

ఈ శ్లోకంలో ఎంత అర్థం ఉందో తెలుసా..
 
“అనాయాసేన మరణం”  
మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖంగా చనిపోవాలి. ఎప్పుడూ అనారోగ్యం బారిన పడకుండా మంచానికి పరిమితం కాకుండా, బాధతో కాకుండా రోజువారీ జీవితాన్ని గడిపుతూనే కన్నుమూయాలి 

“బినా దేన్యేన జీవనం” 
ఎవరిపైనా ఆధారపడే జీవితాన్ని ఇవ్వకు.ఎవ్వరినీ ఆశ్రయించే పరిస్థితి కల్పించకు. ఎవరి దయకోసం ఎదురుచూసే పరిస్థితిని ఇవ్వకు. సహాయం కోసం ఇతరులను వేడుకోకుండా జీవితానికి ముగింపును ఇవ్వు

"దేహంతే తవ సానిధ్యం" 
మరణం ఎప్పుడు వచ్చినా కానీ అధి భగవంతుడి సన్నిధిలోనే జరగాలి. భీష్మ పితామహుడి  మరణం సమయంలోనూ శ్రీ‌కృష్ణుడు స్వయంగా ఆయన ముందు నిలబడ్డాడు. అలా ఆయన దైవ దర్శనాన్ని చేసుకుని భగవంతుడి సన్నిధిలోనే ప్రాణాలు విడిచిపెట్టాడు. నాక్కూడా అలాంటి మరణాన్ని ప్రసాదించు అని అర్థం.
 
"దేహి మే పరమేశ్వరం" 
ఓ భగవంతుడా మాకు అలాంటి వరాన్ని ఇవ్వు అని అర్థం
 
ఆలయంలో కూర్చున్న ఆ కొన్ని నిముషాలు ఈ శ్లోకాన్ని భక్తిపూర్వకంగా పఠించాలి. 

భగవంతుడిని ఏమీ ప్రత్యేకంగా కోరుకోవద్దు..మీకు ఏం ఇస్తే మంచి జరుగుతుందో భగవంతుడికి తెలుసు. మనం పొందేది అయినా కోల్పోయేది అయినా ప్రతిదీ మన కర్మఫలమే. అందుకే గుడిలో దర్శనం తర్వాత కూర్చుని ప్రార్థన చేయాలి కానీ అది కావాలి, ఇది కావాలని అని కోర్కెల చిట్టాను విప్పకూడదు.  

'ప్రార్థన'
ప్ర అంటే ప్రత్యేకమైనది, అత్యంత ఉత్తమమైనది అని అర్థం
అర్థన అడగడం, అభ్యర్థించడం
ప్రత్యేకమైన అత్యున్నత అభ్యర్థన అని అర్థం
 
ఆలయంలో ఉన్న ఆ కొద్ది నిముషాలు భగవంతుడి ఎదురుగా నిల్చుని కళ్లు మూసుకోవద్దు. కళ్ల నిండుగా భగవంతుడిని చూడండి. పరమాత్ముడి దర్శనానికి వచ్చి కళ్లు మూసుకోవడం ఎందుకు..నిజరూపాన్ని చూడండి, దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకోండి, ఆ రూపాన్ని కళ్లలో నింపుకోవాలి.  

దర్శనం తర్వాత ప్రశాంతంగా కాసేపు కూర్చుని అప్పుడు కళ్లుమూసుకుని మీరు దర్శించుకున్న భగవంతుడి రూపాన్ని ధ్యానించండి. అప్పుడు కూడా మీకు దేవుడు కనిపించకపోతే మళ్లీ లోనికివెళ్లి దర్శించుకోండి. పైన ఉన్న శ్లోకాన్ని భక్తిపూర్వకంగా పఠించండి.

ఆలయంలో కొంతసేపు కూర్చోవడం వల్ల అక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రభావం మీపై ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు మీనుంచి దూరమవుతాయి. పవిత్రమైన శ్లోకాలు, గంటల శబ్ధం మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆలయంలో అనుభవించే ఆధ్యాత్మిక ఆనందం మీ మెదడులో కండరాలను ఉత్తేజపరిచేలా చేస్తుంది. ఆలయంలో ధ్యానం చేస్తే మీకు రెట్టింపు శక్తి లభిస్తుంది. అందుకే కాసేపు ఆ ప్రదేశంలో కూర్చోవాలి అని చెబుతారు. 

పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!

అంతర్వాహిని సరస్వతి నది ఎక్కడ పుట్టింది.. పుష్కర స్నానాలు ఎక్కడచేయాలి..ఘాట్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

గురువారం కృష్ణాష్టకం: చదువు, ఉద్యోగంలో వెలగాలంటే ఈ ఒక్కటీ పాటించండి!
గురువారం కృష్ణాష్టకం: చదువు, ఉద్యోగంలో వెలగాలంటే ఈ ఒక్కటీ పాటించండి!
వారణాసిలో గంగానది ఒడ్డున అజ్ఞాత భిక్షువు! మీరెవరో తెలుసంటూ కాళ్లు వదలని వ్యక్తి! ఇంతకీ ఎవరా మహానుభావుడు?
వారణాసిలో గంగానది ఒడ్డున అజ్ఞాత భిక్షువు! మీరెవరో తెలుసంటూ కాళ్లు వదలని వ్యక్తి! ఇంతకీ ఎవరా మహానుభావుడు?
Guru Purnima 2026: ఏం చేసినా కలసిరావడం లేదా? గురు పౌర్ణమి రోజు సులభమైన ఈ పరిహారం చేయండి!
ఏం చేసినా కలసిరావడం లేదా? గురు పౌర్ణమి రోజు సులభమైన ఈ పరిహారం చేయండి!
Guru Purnima 2026: గురు పౌర్ణమి పూజా విధానం! ఈరోజు ఈ 7పనులు చేస్తే సంపద, విజయం, అదృష్టం మీ సొంతం!
గురు పౌర్ణమి పూజా విధానం! ఈరోజు ఈ 7పనులు చేస్తే సంపద, విజయం, అదృష్టం మీ సొంతం!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget