Mercury Transit In Taurus: వృషభ రాశిలోకి గ్రహాల రాకుమారుడు..మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Budha Gochar Dates 2025: ప్రస్తుతం మేష రాశిలో ఉన్న బుధుడు..మే 21 సాయంత్రం వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే...

Mercury Transit in Tarus May 21: జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం బుధుడిని తెలివితేటలు, వృత్తి వ్యాపారాలకు ప్రతీకగా పరిగణిస్తారు. ప్రకారం, బుధుడిని తెలివితేటలు, వ్యాపారానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న బుధుడు..మే 21 సాయంత్రం వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. జూన్ 6 న వృషభం నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక్కో రాశిలో బుధుడి సంచారం మూడు వారాల్లోపే అయినా ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మేష రాశి
మేష రాశివారు మంచి ఫలితాలు పొందుతారు. నూతన ప్రాజెక్టులు చేపట్టేవారికి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. ఆవేశం అదుపులో ఉంచుకోవడం ముఖ్య.
వృషభ రాశి
మీ రాశిలో బుధుడి సంచారం వల్ల ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు, ఉద్యోగులకు అనుకూల ఫలితాలున్నాయి
మిథున రాశి
వృషభంలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారి ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. అదనపు ఖర్చులు ఆందోళన పెంచుతాయి.
కర్కాటక రాశి
బుధుడి సంచారం ఈ రాశివారికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది.ఈ సమయంలో ప్రారంభించే నూతన వ్యవహారాలు మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగం, వ్యాపారంలో అడుగులు ముందుకు పడతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు
సింహ రాశి
ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో మీకు మంచిఫలితాన్నిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతాధికారుల సపోర్ట్ ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యా రాశి
వృషభ రాశిలో బుధుడి సంచారం వల్ల కన్యారాశివారు అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ రంగంలో ఉండేవారు కీలక బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు.
తులా రాశి
మీ రాశి నుంచి అష్టమంలో బుధుడి సంచారం ఈ రాశివారికి ఊహించని ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయదా వేసుకోండి
వృశ్చిక రాశి
బుధుడి సంచారం సమయంలో ఈ రాశివారు కోపంగా వ్యవహరిస్తారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగులు అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెడతారు. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
ధనుస్సు రాశి
బుధుడి సంచారం ఈ రాశివారికి భలేగా కలిసొస్తుంది.నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. నూతన ఆస్తి లేదా వాహనం కొనుగోలుకి ప్రణాళికలు వేసుకుంటారు. పనిచేసే చోట మంచి గుర్తింపు ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
మకర రాశి
మీ రాశి నుంచి ఐదో స్థానంలో బుధుడి సంచారం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలుంటాయి. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. ఆరోగ్యం బావుంటుంది.
కుంభ రాశి
మీ రాశి నుంచి నాలుగో స్థానంలో బుధుడి సంచారం మీకు కలిసొస్తుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అప్పులు ఇవ్వొద్దు, మధ్యవర్తిత్వం వహించవద్దు
మీన రాశి
వృషభంలో బుధుడి సంచారం మీ రాశి నుంచి మూడో స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆవేశంగా వ్యవహరించవద్దు.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!





















