Somvati Amavasya 2025: మే 26 సోమావతి అమావాస్య ప్రాముఖ్యత ఏంటి!
Amavasya 2025 May Dates and Timings: మే నెలలో అమావాస్య ఎప్పుడొచ్చింది? ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఈ రోజు ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి...

Amavasya Tithi in 2025 May: హిందూ ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. అమావాస్య తిథి రోజు దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అత్యంత పుణ్యఫలం అని భావిస్తారు. మే నెలలో అమావాస్య తిథి ఎప్పుడు వస్తుంది మరియు దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
వైశాఖ మాసం 2025 అమావాస్య ఎప్పుడు?
అమావాస్య తిథి 2025 మే 26 సోమవారం ఉదయం 11.19 నిముషాలకు ప్రారంభమవుతుంది
ఇది 2025 మే 27 మంగళవారం ఉదయం 8.55 కి ముగిసిపోతుంది..అనంతరం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది
వైశాఖ మాసం అమావాస్య తిథి ఈ ఏడాది 2025 మే 26న వస్తుంది
సాధారణంగా తిథులన్నీ సూర్యోదయానికి ఉండే సమయాన్నే లెక్కలోకి తీసుకుంటాం..ఆ రోజు ఆ తిథిగానే భావిస్తాం. పండుగల నిర్వహణ సమయంలోనూ ఇదే పరిగణలోకి తీసుకుంటాం. అయితే అమావాస్య తిథి రాత్రికి ఉండడం ప్రధానం. అందుకే వైశాఖ మాస అమావాస్య మే నెలలో 26వ తేదీ సోమవారం వచ్చింది. సోమవారం రావడంతో ఈ రోజే సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...
తెలగువారికి తెలుగు నెల పాడ్యమితో ప్రారంభమై అమావాస్యతో ముగుస్తుంది. ఉత్తరాది వారికి నెల అంటే.. పాడ్యమితో ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తుంది. అంటే మనకు సగం నెల గడిచి పౌర్ణమి పూర్తయ్యేసరికి ఉత్తరాది వారికి నెల పేరు మారిపోతుంది.
ఉదాహరణకు మే నెల 26న వస్తున్నది వైశాఖమాస అమావాస్య...ఎందుకంటే మనకు అమావాస్యతో తెలుగు నెల పూర్తవుతుంది కాబట్టి...
మే 26న ఉత్తరాదివారికి జ్యేష్ఠమాస అమావాస్యగా పరిగణిస్తారు..ఎందుకంటే వారికి పౌర్ణమితో నెల పూర్తవుతుంది..ఆ మర్నాటి నుంచి తర్వాతి నెల ప్రారంభమవుతుంది..అందుకే జ్యేష్ఠమాస అమావాస్యగా పరిగణిస్తారు.
వైశాఖ మాస అమావాస్య తిథి ప్రాముఖ్యత
వైశాఖ మాస అమావాస్య తిథిని చాలా శుభకరమైన పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అమావాస్య తిథి ప్రాముఖ్యత మరో కారణం ఏమిటంటే ఈ తిథి రోజు శనిదేవుని జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు మీరు గౌరీశంకరులతో పాటూ శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. సోమవారం కావడం వల్ల ఈ రోజును సోమవతి అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు భగవంతుడు శివుడు, పార్వతిని పూజిస్తారు. ఈ రోజు పూజ చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు.
అమావాస్య తిథి రోజు పితృదేవతల పూజ
సోమవతి అమావాస్య రోజు పవిత్ర నదులలో స్నానం చేయడం ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు దానం చేయడం కూడా ఫలదాయకం. అలా చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నులవుతారు. వైశాఖ మాస అమావాస్య తిథి రోజు పితృదోషం నుంచి విముక్తి పొందడానికి పిండదానం, తర్పణం చేయాలని నమ్ముతారు. అమావాస్య తిథి రోజు పితృదేవతల ఆశీర్వాదం పొందడానికి ఈ రోజు అవసరమైన వారికి భోజనం పెట్టండి. అలాగే వస్త్రదానం చేయండి. అన్నదానం చేయండి. అన్నం, పాలు, బెల్లం, తెల్లని వస్తువులను దానం చేయడం శుభప్రదం.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి రాసినది మాత్రమే. ఇది కేవలం ప్రాధమిక సమాచారం. దీనిని అనుసరించే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్య శాస్త్ర పండితులను సంప్రదించండి.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















