అన్వేషించండి

Kaleshwara Mukteeshwara Swamy : సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వెళుతున్నారా..ఆ చుట్టుపక్కల తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఇవే!

Saraswati Pushkaralu : సరస్వతి నది పుష్కరాల సందర్భంగా భారీగా భక్తులు కాళేశ్వరం తరలివెళుతున్నారు. అయితే పుష్కరస్నానం చేసి వచ్చేయడమే కాదు..ఆ చుట్టుపక్కల ఉన్న చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి..

Saraswati Pushkaralu Kaleshwaram :  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదిలో పుష్కస్నానం ఆచరిస్తున్నారు భక్తులు. అనంతరం  కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. అయితే కాళేశ్వరం వెళ్లేవారంతా ఆ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఓ రెండు రోజుల్లో అవన్నీ చుట్టేయవచ్చు.  

కోటగుళ్లు 

కాళేశ్వరక్షేత్రం నుంచి కోటగుళ్లు 67 కి.మీ.దూరంలో ఉన్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల సముదాయంలో మొత్తం 22 గుళ్లు ఉన్నాయి.  కాకతీయుల నిర్మాణ నైపుణ్యానికి ఇవి ఉదాహరణలు. ఈ గుడులన్నీ ముక్కంటికే అంకితం చేశారు.  

రామప్ప 

ములుగు జిల్లాలో ఉన్న రామప్ప.. కాళేశ్వరం నుంచి 79 కి.మీ. దూరంలో ఉంది. రేచర్ల రుద్రుడు 13వ శతాబ్దంలో రామప్ప ఆలయాన్ని నిర్మించారు.  ఈయన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సర్వసైన్యాధ్యక్షుడు . నిర్మించిన శిల్పి పేరుతోనే ఆలయాన్ని పిలుస్తారు. ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు ముఖంగా నిర్మించిన ఈ ఆలయాన్ని 2021 జులై 25న యునెస్కో గుర్తింపు లభించింది.  

ధర్మపురి 

జగిత్యాల జిల్లా ధర్మపురిలో యోగ నారసింహుడి ఆలయం ఉంది. కాళేశ్వరానికి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నారసింహ క్షేత్రానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని చెబుతారు. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే రాజు పరిపాలించడం వల్ల ఈ పేరు వచ్చిందని స్థలపురాణం. ధర్మవర్మ తపస్సుకు మెచ్చిన నారసింహుడు యోగ నారసింహుడిగా ప్రహ్లాదుడితో కలసి ఇక్కడ సాలగ్రామ రూపంలో వెలిశాడని చెబుతారు. దీనిని  త్రిమూర్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ  బ్రహ్మదేవుడి విగ్రహంతో పాటూ శివుడు రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ యముడి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ధర్మపురికి వెళితే యమపురి ఉండదని భక్తుల విశ్వాసం. ఇక్కడ బ్రహ్మగుండం, యమగుండం, సత్యవతి గుండం,  పాలగుండం, చక్రగుండం పేర్లతో పుష్కరిణిలున్నాయి.

మేడారం 

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం ఆదివాసీలకు ఆరాధ్య దైవం. ఈ క్షేత్రం కాళేశ్వరం నంచి 83 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమ్మక్క సారలమ్మ కొలువైన ఈ ప్రాంతంలో ప్రతి రెండేళ్లకోసారి వనజాతర నిర్వహిస్తారు. కన్నులపండువగా జరిగే ఈ జాతరలు తెలంగాణతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.

వేయి స్తంభాల ఆలయం

 కాళేశ్వర క్షేత్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది వేయి స్తంభాల ఆలయం. ఖిలా వరంగల్‌  లో ఉన్న వేయి స్తంభాల ఆలయానికి 1200 ఏళ్ల చరిత్ర ఉంది.  కాకతీయుల పరిపాలనలో నిర్మించిన పర్యాటక ప్రాంతాల్లో ఖిలా వరంగల్ ఒకటి‌.  రాష్ట్ర చిహ్నమైన కాకతీయుల కళాతోరణంతో పాటు నాటి కాలంలో నిర్మించిన ఆలయాలను ఇక్కడ చూడొచ్చు.

లక్నవరం సరస్సు 

ములుగుజిల్లా గోవిందరావుపేట మండలంలో ఉన్న లక్నవరం సరస్సు కాకతీయుల గొలుసుకట్టు చెరువులకు ప్రతీక. కాళేశ్వరం నుంచి 104 కి.మీ. దూరంలో ఉంది.  రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక ద్వీపాన్ని కలుపుతూ నిర్మించిన తీగల వంతెన ఇక్కడ చాలా ప్రత్యేకం. ఆ తర్వాత మరో రెండు వంతెనలు నిర్మించారు

అంతర్వాహిని సరస్వతి నది ఎక్కడ పుట్టింది.. పుష్కర స్నానాలు ఎక్కడచేయాలి..ఘాట్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget