అన్వేషించండి

Jyoti Malhotra: పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం!

Gantasala Song in Pakistan Temple: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో కటార్సరాజ్ ఆలయాన్ని సందర్శించింది. ఆ సమయంలో అక్కడ ఘంటసాల పాట వినిపించడాన్ని వీడియోలో రికార్డ్ చేసింది..

Jyoti Malhotra: పాకిస్థాన్ లో ఓ ప్రాచీన ఆలయంలో మన ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన పాట వినిపించడం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.  గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన భారతీయ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా  గతంలో షూట్ చేసిన ఓ వీడియో ద్వారా ఈ ఆసక్తికర దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో యూ ట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. సంబరంగా షేర్ చేసుకుని మరీ చూస్తున్నారు సంగీత ప్రియులు.  

పైనున్న యూట్యూబ్ వీడియోలో 6 నిముషాల 50 సెకెన్ల నుంచి తెలుగు పాట వినొచ్చు.

హర్యానాలోని హిసర్ కి చెందిన 33 ఏళ్ళ  జ్యోతి మల్హోత్రాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెల్ విత్ జ్యో పేరుతో వీడియోస్ చేస్తుంటుంది. ట్రావెల్ విత్ జ్యో పేరుతో యూట్యూబ్‌ చానెల్ ఉంది. పహల్గాం దాడి జరగడానికి రెండు నెలల ముందు ఆమె కటాస్ రాజ్ గుడిలో ఓ వీడియో షూట్ చేసింది. అక్కడ శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. జ్యోతి ఆంజనేయుడి ఆలయంలోకి వెళ్లగానే అక్కడ తెలుగు పాట వినిపించంది. ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల పాడిన భూకైలాస్ శినమాలో రాముని అవతారం పాట అది. రాముని అవతారం రఘుకుల సోముని అవతారం అంటూ ఆంజనేయుడి ఆలయంలో కూర్చుని ఓవ్యక్తి పాడుతున్న వీడియోని షూట్ చేసింది జ్యోతి. 50 నిముషాల 52 సెకెన్లు  ఉన్న ఈ ట్రావెల్ వీడియోలో 6 నిముషాల 50 సెకెన్ల దగ్గర తెలుగు పాట మీరు వినొచ్చు.  

పాకిస్థాన్ కోసం గూఢచారిగా మారిందన్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో పాక్ హై కమిషన్‌కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆమె పాకిస్తాన్ కోసం గూఢచారిగా పని చేయటం ప్రారంభించిందనే ఆరోపణలున్నాయి. ఏప్రిల్‌ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనకు రెండు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి వీడియోస్ తీసినట్టు సమాచారం. ఆ సమాచారాన్ని పాకిస్థాన్ ఏజెంట్లకు చేరవేసిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడి జరగడానికి జ్యోతి పంపిన వీడియో కూడా కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆపరేషన్ సిందూర్ తర్వాత నెలకొన్ని ఉద్రిక్తతక సమయంలోనూ ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో అధికారి డానిష్ తో టచ్ లో ఉన్నట్టు నిర్ధారణ అయింది.  కేవలం పాకిస్థాన్ లో మాత్రమే కాదు.. జ్యోతి పలుమార్లు పాకిస్థాన్ లో పర్యటించింది, ఓసారి చైనా కూడా వెళ్లొచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.

 దేశానికి సంబంధించిన సున్నితమైన విషయాలు పాకిస్తాన్‌కు చేరవేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ పై నెటిజన్లకు ఫోకస్ పెరిగింది. ఇందులో బాగంగా వీడియోస్ లో ఈ తెలుగు పాట వెలుగుచూసింది. పరాయిదేశంలో అందులోనూ పాకిస్థాన్ లో ఆలయంలో ఘంటసాల పాట వినిపించడం తెలుగువారిని ఆనందంలో ముంచెత్తుతోంది. దేశాలు వేరైనా సంగీతానికి సరిహద్దులు లేవని నిరూపించే వీడియో ఇది.

అంతర్వాహిని సరస్వతి నది ఎక్కడ పుట్టింది.. పుష్కర స్నానాలు ఎక్కడచేయాలి..ఘాట్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కాళేశ్వరంలో 12 ప్రత్యేకతలు.. సరస్వతి పుష్కరాలకు వెళ్లేవారు ఇవి మిస్సవకండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Coalition Politics: కల్తీ నెయ్యి ఇష్యూలో అంటీముట్టనట్లుగా బీజేపీ - టీడీపీ, జనసేనలదే పోరాటం - ఎందుకిలా ?
కల్తీ నెయ్యి ఇష్యూలో అంటీముట్టనట్లుగా బీజేపీ - టీడీపీ, జనసేనలదే పోరాటం - ఎందుకిలా ?
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
Telangana Municipal Elections 2026: తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభం
తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభం

వీడియోలు

Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Coalition Politics: కల్తీ నెయ్యి ఇష్యూలో అంటీముట్టనట్లుగా బీజేపీ - టీడీపీ, జనసేనలదే పోరాటం - ఎందుకిలా ?
కల్తీ నెయ్యి ఇష్యూలో అంటీముట్టనట్లుగా బీజేపీ - టీడీపీ, జనసేనలదే పోరాటం - ఎందుకిలా ?
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
Telangana Municipal Elections 2026: తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభం
తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభం
YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
Allu Arjun: అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!
అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Embed widget