అన్వేషించండి

Weekly Horoscope For May 18 to 25 : ఈ వారం ఈ రాశుల ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, కళారంగంలో ఉండేవారికి అన్నీ శుభ ఫలితాలే - వారఫలాలు మే 18 to 25

Weekly HoroscopeFrom May 18 to 25: మే 18 నుంచి మే 25 వరకూ ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. ఆర్థికంగా లాభపడతారు, కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది.

Your Weekly Horoscope For May 18 - 25  : మే 18 సోమవారం నుంచి మే 25 ఆదివారం వరకూ ఈ వారం ఏ రాశులవారికి అద్భుత ఫలితాలున్నాయో   ఇక్కడ తెలుసుకోండి...

వృషభ రాశి (Taurus  Weekly Horoscope)

ఈ వారం మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. అదష్టం కలిసొస్తుంది, అన్నింటా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడం మంచిదే కానీ అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. గౌరవం పెరుగుతుంది. అన్ని విషయాల్లోనూ ధైర్యంగా దూసుకెళ్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆశక్తి చూపిస్తారు. రాజకీయాల్లో ఉండేవారి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వారం ఆరంభంలో కొంచెం ఒత్తిడి ఉన్నా ఆ తర్వాత అంతా సంతోషమే. 

సింహ రాశి (Leo  Weekly Horoscope)

ఈ వారం సింహరాశివారికి బాగానే ఉంది కానీ చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న సమస్యలు, అడ్డంకుల నుంచి బయటపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ శత్రువులు ఉత్సాహంగా ఉన్నా మీరే పైచేయి సాధిస్తారు. చేపట్టిన పనులన్నీ పట్టుదలతో పూర్తిచేసేస్తారు. స్థిరాస్తులు వృద్ధి చేసేందుకు ఆలోచిస్తారు. వారాతంలో బంధుమిత్రులో వివాద సూచనలున్నాయి 

తులా రాశి (Libra  Weekly Horoscope) 

ఈ రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వారం మొత్తం ఆనందంగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనులు నెమ్మదించినట్టు అనిపిస్తాయి కానీ పూర్తిచేసేస్తారు. ఆర్థిక పరిస్థితి బాలేదు అనిపిస్తుంది కానీ అవసరానికి డబ్బు చేతికందుతుంది. అనుభవజ్ఞుల సలహాలు లేకుండా పెట్టుబడులు పెట్టొద్దు.ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వారం మొదట్లో ఖర్చులు పెరుగుతాయి. 

వృశ్చిక రాశి (Scorpio   Weekly Horoscope) 

ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో తమ మాట నెగ్గించుకుంటారు. వ్యాపారులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.  గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలనిస్తాయి. తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. దేవగురు బృహస్పతి అష్టమంలో ఉన్నందున ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళతారు. రాజకీయాల్లో ఉండేవారికి సమయం కలిసొస్తుంది. వారం మధ్యలో ఒత్తిడి పెరుగుతుంది 

ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 
 
ధనస్సు రాశివారికి ఈ వారం మంచి ఫలితాలున్నాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనవసర చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వారం మధ్యలో మంచి ఫలితాలున్నాయి.  ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి

కుంభ రాశి  (Aquarius  Weekly Horoscope) 
 
ఈ వారం కుంభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఎలినాటి శని వల్ల కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో దూసుకెళ్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో విభేదాలున్నా నెమ్మదిగా సర్దుకుంటాయి

మీన రాశి (Pisces  Weekly Horoscope) 

ఈ వారం మీన రాశివారు శ్రమకు తగిన ఫలాలు అందుకుంటారు. ఉద్యోగులకు అద్భుతంగా కలిసొచ్చే సమయం. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. కళారంగంలో ఉండేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి.  మీ సన్నిహితుల కారణంగా మీరు లాభపడతారు. ప్రశాంతంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వారాంతంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. 

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

అంతర్వాహిని సరస్వతి నది ఎక్కడ పుట్టింది.. పుష్కర స్నానాలు ఎక్కడచేయాలి..ఘాట్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సరస్వతి పుష్కర స్నానానికి కాళేశ్వరం వెళుతున్నారా...ఆ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

కాళేశ్వరంలో 12 ప్రత్యేకతలు.. సరస్వతి పుష్కరాలకు వెళ్లేవారు ఇవి మిస్సవకండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Christmas 2025 : క్రిస్మస్​కి ఇంటిని తక్కువ బడ్జెట్​లో, స్టైలిష్​గా డెకరేట్ చేయాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
క్రిస్మస్​కి ఇంటిని తక్కువ బడ్జెట్​లో, స్టైలిష్​గా డెకరేట్ చేయాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Top 5 Silver Countries: వెండి రారాజు ఎవరు? ప్రపంచంలో సిల్వర్ కెపాసిటీ ఉన్న టాప్ 5 దేశాలివే
వెండి రారాజు ఎవరు? ప్రపంచంలో సిల్వర్ కెపాసిటీ ఉన్న టాప్ 5 దేశాలివే
Embed widget