అన్వేషించండి

Significance of Bell in Temple : గుడికి వెళ్లిన వెంటనే, వచ్చే ముందు, పూజ జరుగుతున్నప్పుడు ..గంట ఎప్పుడు కొట్టాలి!

Temple Bell: ఆలయాలను సందర్శించేటప్పుడు అక్కడున్న గంట మోగిస్తారు. అయితే ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే, వచ్చేటప్పుడు ఎప్పుడు గంట కొట్టాలి? గంట మోగించడం వెనుకున్న ఆధ్యాత్మి, శాస్త్రీయ కారణాలేంటి?

Significance of Bell in Temple :  దేవాలయంలో గంటలు ఎందుకు మోగిస్తారు? కారణం మీకు తెలుసా? గంట ఎప్పుడు కొట్టాలి? అసలెందుకు ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజ చేసేటప్పుడు గంట కొడతారు? అదే పనిగా మోగించేయకుండా ఓ నిర్దిష్ట సమయంలోనే గంట మోగస్తారు? దీనివెనుకున్న ఆధ్యాత్మిక కారణాలు, శాస్త్రీయ కారణాలు మీకు తెలుసా?
 
పూజ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకూ సంపూర్ణ విధిలో గంటకు ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఈ యుగంలోనే కాదు గడిచిన యుగాల్లోనూ గంటకు ప్రాముఖ్యత ఉంది. స్కాంద పురాణం , అగ్ని పురాణం ,  తంత్ర గ్రంథాల్లో పూజలో గంట ప్రాముఖ్యత గురించి ఉంది. అందుకే పూజ సంబంధిత వస్తువులో గంటను తప్పని సరిగా ఉంచుతారు. ఈ శబ్ధం ప్రతికూల శక్తులను తొలగిస్తుందని భావిస్తారు. 
 
 హిందూ ధర్మ గ్రంథాల్లో  'నాద బ్రహ్మ' భావనలో ధ్వనిని బ్రహ్మ రూపంగా భావిస్తారు. గంట శబ్దం పూజ ప్రారంభానికి సంకేతం ఇస్తుంది..పూజపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత కుర్చుకునేందుకు సహాయపడుతుంది
 
ఆధునిక పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?
 
ధ్వని తరంగాలు, కంపనాలకు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పండితుల అభిప్రాయం ప్రకారం గంట శబ్దం వల్ల ఏర్పడే ధ్వని తరంగాలు వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి. ఓ నివేదిక ప్రకారం ఇవి 3-7 హెర్ట్జ్ ఆల్ఫా తరంగాలను ఉత్పత్తి చేస్తాయి, ఇవి మెదడును శాంతింపజేయడంలో సహాయపడతాయి.  

ధ్యానం , మెడిటేషన్‌కు ముందు గంట శబ్దం మెదడును 'ఫోకస్' మోడ్‌లోకి తీసుకువస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది , పూజపై మనసుని లగ్నం చేస్తుందని నమ్ముతారు.

గంట శబ్దం మరియు చైతన్యానికి సంబంధం ఏంటి?

అంతర్గత శక్తి   జాగరణ జరిగినప్పుడే వ్యక్తి తనను తాను తెలుసుకునే దిశగా అడుగులు వేస్తాడని నమ్ముతారు. తనకి తన ఉనికి గురించి అవగాహన కల్పిస్తుంది గంట శబ్దం. అందుకే తాంత్రిక సాధనలో గంటను 'చైతన్యం మేల్కొల్పే' యంత్రంగా భావిస్తారు. ఇది మీ 'అంతర్గత చైతన్యం'ను బ్రహ్మతో కలిపే సాధనం అని నమ్ముతారు. 

గంట శబ్దం శరీరంలోని ఏడు చక్రాలపై కంపన ప్రభావాన్ని చూపుతుంది, దీనివల్ల సమతుల్యత ఏర్పడుతుంది. ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్‌లను చెక్కుచెదరకుండా ఉంచుతుంది. శరీరంలోని సప్తచక్రాలు చైతన్యవంతం అవడంతో పెరిగిన ఆరాధనా శక్తి వల్ల భక్తి మనసులోనే నిలిచి ఉంటుంది.

గంటను ఎప్పుడు మోగించాలి?

ఇంతకీ గంటను ఎప్పుడు మోగించాలంటే..ఆలయంలోకి ప్రవేశించగానే గంటను మోగిస్తే శరీరం, మనసు స్వచ్ఛమవుతుంది. మనసు భగవంతుడిపై నిలుస్తుంది. గుడి నుంచి బయలుదేరేముందు గంట మోగిస్తే మీ సందేశం నేరుగా భగవంతుడిని చేరుతుంది. ఫలితంగా మీ కోర్కెలు త్వరగా నెరవేరుతాయట. ఇక పూజ సమయంలో అంటే..పూజ పూర్తైన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు గంట మోగిస్తారు. ఇంట్లో పూజల సమయంలోనూ పూజ ప్రారంభానికి ముందు భగవంతుడిని ఆహ్వానిస్తూ గంట మోగిస్తారు. పూజ అనంతరం  హారతి ఇచ్చే సమయంలో గంట మోగిస్తారు.   

పూజలో గంట మోగించడం అంటే కేవలం ధార్మిక సంప్రదాయం మాత్రమే అని భావించవద్దు..పూజలో భాగంగా గంటను మోగించినప్పుడు ఆ శబ్ధాన్ని ప్రశాంతంగా స్వీకరించండి..ఈ పవిత్రధ్వని మీకు ఎంత ప్రశాంతత ఇస్తుందో అర్థమవుతుంది.

గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాల్లో అందించిన సమాచారం ఆధారంగా మీకు అందించిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం. మాత్రమే. అనుసరించేముందు మీకు నమ్మకమైన ఆధ్యాత్మిక వేత్తల సలహాలు అడిగి తెలుసుకోండి..

పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!

అంతర్వాహిని సరస్వతి నది ఎక్కడ పుట్టింది.. పుష్కర స్నానాలు ఎక్కడచేయాలి..ఘాట్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget