అన్వేషించండి

Shani Jayanti 2025 Date: మే 27 శని జయంతి , మంగళవారం మరింత పవర్ ఫుల్.. ఈ వస్తువుల దానం చేస్తే చాలా మంచిది - ఇవన్నీ సిద్ధం చేసుకోండి!

Shani Jayanti 2025 Date: శని జయంతి వైశాఖ మాసం అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది అమావాస్య మే 27 మంగళవారం వచ్చింది. ఈ రోజు మీరు ఈ దానాలు చేస్తే అభివృద్ధి చెందుతారు

Shani Jayanti 2025 Donation May 27 2025:   కర్మల దేవుడిగా కొలిచే శని జన్మదినోత్సవమే శని జయంతి. ఏటా వైశాఖ అమావాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. సూర్యభగవానుడు చాయ కుమారుడు శని. ఈ ఏడాది శని జయంతి మే 27 మంగళవారం వచ్చింది.  

2025 శని జయంతి తిథి? (Shani Jayanti 2025 Tithi)

అమావాస్య తిథి మే 26, 2025 సోమవారం ఉదయం 11 గంటల 20 నిముషాలకు ప్రారంభమైంది
అమావాస్య తిథి మే 27, 2025 మంగళవారం ఉదయం 8 గంటల 55 నిముషాల వరకు ఉంది
సాధారణంగా అమావాస్య తిథిని రాత్రివేళకు ఉండడం ప్రధానంగా భావిస్తారు..కానీ జయంతి వేడుకలు నిర్వహించుకునేటప్పుడు మాత్రం సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అంటే శని జయంతి ఈ ఏడాది మే 27 మంగళవారం వచ్చింది.

శని జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేక వస్తువులు దానం చేస్తే మీ జీవితంలో వృద్ధి ఉంటుందని పండితులు చెబుతారు. ఈ రోజు ఏ వస్తువులు దానం చేస్తే శని ఆగ్రహం తగ్గి అనుగ్రహం పొందుతారో ఇక్కడ తెలుసుకోండి..
 
2025 శని జయంతి దానం (Shani Jayanti 2025)

నల్ల నువ్వులు

శని జయంతి రోజు నల్ల నువ్వులు దానం తప్పకుండా చేయండి.ఈ  దానం చాలా శుభప్రదం. నల్ల నువ్వులను మీరు శనిదేవునికి నూనె సమర్పించేటప్పుడు కూడా వేయొచ్చు.
 
ఆవనూనె

శని జయంతి రోజు శనిదేవునికి ఆవనూనె సమర్పించడం చాలా మంచిది. ఈ రోజు శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి, అందులో నల్ల నువ్వులు కూడా వేయండి.

నల్లని వస్త్ర దానం

శని జయంతి రోజు నల్ల బట్టలను దానం చేయండి. నల్ల దుస్తులు లేకుంటే ఏదైనా రంగు దుస్తులను అయినా దానం చేయొచ్చు. వస్త్రదానం చేయడం ముఖ్యం
 
నల్ల చెప్పుల దానం

శని జయంతి రోజు అవసరమైన వారికి చెప్పులు దానం చేయండి. శని జయంతి వేసవి కాలంలో వస్తుంది. అందుకే ఈ చెప్పులు, నీటి కుండ, మజ్జిగ దానం చేయడం కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ శుభాన్నిస్తుంది

ఇనుము దానం

ఇనుము వస్తువు ఎవరి నుంచి ఊరికే తీసుకోకూడదు అంటారు..ఇనుము శనికి సంకేతం. అందుకే శని జయంతి రోజు ఇనుము వస్తువు దానం చేయడం శుభప్రదం. ఈ రోజు పిన్నులు, పాత్రలు లేదా ఏదైనా ఇనుప వస్తువులను దానం చేయవచ్చు. దీనివల్ల శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

శని శాంతి మంత్రం

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించనది మాత్రమే. ఇది ప్రాధమిక సమాచారం.. దీనిని అనుసరించే ముందు మీరు విశ్వశించే పండితులను అడిగి అనుసరించండి.  

పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget