Rajahmundry Jp Nadda : వైఎస్ఆర్‌సీపీ పోవాలి - బీజేపీ రావాలి
వైఎస్ఆర్‌సీపీ పోవాలి - బీజేపీ రావాలని అని ప్రజలు కోరుకుంటున్నారని జేపీ నడ్డా తెలిపారు. రాజమండ్రిలో గోదావరి గర్జన సభలో ఆయన ప్రసంగించారు.
Rajahmundry Jp Nadda : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ పోవాలి బీజేపీ రావాలని .. జేపీ నడ్డా పిలుపునిచ్చారు. రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆయన ప్రసంగించారు. ఏపీని వైఎస్ఆర్‌సీపీ నాశనం చేస్తోందని మండిపడ్డారు. రాజమండ్రి (Rajahmundry) సాంస్కృతిక నగరమని... ఈ గడ్డ నుంచే తెలుగు (Telugu) భాష ప్రారంభమైందని కానీ మాతృభాషను నిర్వీర్యం చేస్తున్నారని నడ్డా ఆరోపించారు. వ్యాపార వ్యతిరేక రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని... అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారని... శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకే జగన్ పనిచేస్తున్నారని... కానీ తమను ఆపలేరని నడ్డా సవాల్ చేశారు.
దేశంలో 5% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రహదారుల విస్తరణకు బడ్జెట్ లో 21% నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై తనకు ఉన్న ప్రేమను శ్రీ @narendramodi గారు చాటుకున్నారు.#GodavariGarjana pic.twitter.com/j9guomNhZy
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) June 7, 2022
2014కు ముందు కేంద్రంలో అవినీతి ప్రభుత్వం వుండేదన్నారు . మోదీ హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. మోడీ దేశంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. దేశ సంస్కృతిని మోడీ మారుస్తున్నారని నడ్డా పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ అయిన ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి సాయం చేస్తున్నారని... అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా కరోనాను నియంత్రించారని నడ్డా గుర్తుచేశారు. దేశంలో ఎయిమ్స్ సంఖ్యను మోడీ పెంచారని ఆయన పేర్కొన్నారు. భారత నుంచి 500 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. రెండో అతిపెద్ద రిటైల్ చైన్‌గా భారత్ మారింది. దేశంలో 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు. భారత్ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోందని నడ్డా తెలిపారు.
వైసీపీ పోవాలి, బిజెపి రావాలి
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) June 7, 2022
-శ్రీ @JPNadda #GodavariGarjana pic.twitter.com/Y0vU1ZeO9C
ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్ల రాజకీయాలతో చిచ్చు రేపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. గోదావరి గర్జనలో మాట్లాడిన ఆయన ఏపీ లో అభివృద్ధే జరగలేదన్నారు. ఏపీలో ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఇసుక, మట్టిని దోచుకుంటున్నారని ఆరోపించారు. బీసీలకూ అన్యాయం చేస్తున్నారని.. హిందుత్వంపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని.. బయట మార్కెట్లలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని సోము వీర్రాజు ఆక్షేపించారు. ఏపీలో మూడు కోట్ల మందిని జగన్ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.