Pavan Kalyan Tirupati : తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ - రెడీ అంటున్న క్యాడర్ !
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసైనికులు కోరుతున్నారు. ఈ విషయంలో పవన్ స్పందన ఎలా ఉండబోతోంది ?

Pavan Kalyan Tirupati : జనసేన అధినేత వపన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ? ఈ ప్రశ్న ఇప్పటికీ జనసేన వర్గాల్లో కూడా పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ తొలి సారిగా తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్తలు తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలని తమ అధినేతకు పిలుపునిచ్చారు. తిరుపతిలో పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. అప్పుడే పవన్ కల్యాణ్ తిరుపతిలో పోటీ చేయాలని.. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రకటించారు.
తిరుపతి ఎమ్మెల్యే "జనసేనానే" ఉండాలని జనసైనికుల కోరిక..
— kiranroyal jsp (@mekiranroyal) May 29, 2022
లక్ష ఓట్ల మెజారిటీతో "పవన్" (మా అధినేత కు) గిఫ్ట్ గా ఇస్తాము..@mekiranroyal @mnadendla @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @JSPShatagniTeam pic.twitter.com/F4xP2Fa41z
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ పోటీ చేశారు. రెండు చోట్ల నుంచి ఓడిపోయారు. భీమవరం నుంచి... గాజువాక నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోవడంతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. జనసేన తరపున రాజోలు నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఆయన కూడా వైఎస్ఆర్‌సీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో జనసేన పార్టీకి ఎమ్మెల్యే లేకుండా అయిపోయినట్లయింది. స్వయంగా అధినేత రెండు చోట్ల ఓడిపోవడంతో పవన్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఇతర పార్టీలు కూడా ముందు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ చేస్తూ వస్తున్నాయి.
తిరుపతి జనసేన పట్టణ కమిటీ మహోత్సవంలో
— kiranroyal jsp (@mekiranroyal) May 29, 2022
అధ్యక్షుడు రాజా రెడ్డి సమక్షంలోనిర్వహించుకున్న
తిరుపతి నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా @PHariPrasad777 @mekiranroyal పాల్గొని నూతన కమిటీ సభ్యులకు దిశానిర్దేశం ఇచ్చారు..@JanaSenaParty @PawanKalyan @mnadendla pic.twitter.com/MXt9CvUq2e
ఈ సారి పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే గతంలో ఓడిపోయిన స్థానాల కంటే... సేఫ్ ప్లేస్ ఎంచుకోవాలని భావిస్తున్నారు. తిరుపతిలో గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి విజయం సాధించారు. పవన్ కల్యాణ్‌కు చిరంజీవికి అక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఈ సారి తిరుపతిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న నమ్మకంతో జనసేన వర్గాలు ఉన్నట్లుగా చెబుతున్నాయి. తమ ఆకాంక్షను శ్రేణులు పవన్ కల్యణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.





















