అన్వేషించండి

Pawan Kalyan : సనాతన ధర్మ రాజకీయాల్లోకి పవన్ - తిరుమల లడ్డూ వివాదంతో స్పేస్ కల్పించుకున్నారా ?

Andhra Pradesh : తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరు భిన్నంగా ఉంది. సనాతన రక్షణకు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో పాటు ..ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తున్నారు.

Pawan Kalyans  On Tirumala Laddu controversy : సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలి.. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా .. అన్ని వర్గాల్లో చర్చ జరగాలి అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ వివాదం విషయంలో స్పందించారు. ఈ స్పందన వెనుక లోతైన అర్థం ఉండటంతో పలువురు స్పందించారు. ఇందులో ప్రకాష్ రాజ్ ఒకరు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చేసి.. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఓ బోర్డును ఏర్పాటు చేయాలన్న సూచన చేశారు. ఇలాంటివి వస్తే.. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ ఎలా అందుకుంటుందో ప్రకాష్ రాజ్ కు తెలుసు. అందుకే.. అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని శిక్షించాలని  సలహా ఇచ్చారు. దీనికి పవన్ రిప్లయ్ ఇవ్వలేదు కానీ .. ఆయన రాజకీయంపై మాత్రం అందరికి ఈ క్లారిటీ వచ్చినట్లయింది. 

లడ్డూ వివాదంతో పవన్ స్పందన ఏం చెబుతోంది  ? 

 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో వస్తున్న వార్తలు కోట్లాది మంది హిందువుల మనో భావాల్ని  దెబ్బతీశాయి.  నెయ్యి విషయంలో  జరిగన తప్పులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.  ఈ క్రమంలో మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి పని చేయాలన్నట్లుగా పవన్ కల్యాణ్ స్పందించార.ు సనాతన ధర్మ రక్షణ బోర్డు అనే ఆలోచనను పవన్ కల్యాణ్ ప్రజల ముందు పెట్టారు. ఈ అంశంపై  పీఠాధితుపు, న్యాయ, మీడియా వర్గాలతో సహా ప్రజాప్రతినిధులంతా చర్చించాలని కోరారు.  ఇలా అందరూ కలిసి సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు నడుంకట్టేలా చేయాలని పవన్ ఆలోచన చేశారు.

హిందూ ఫేస్‌గా పవన్  మారాలనుకుంటున్నారా?

నిజానికి పవన్ కల్యాణ్ తన భావజాలం.. కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుందని  చాలా సార్లు చెప్పారు. అందుకే ఓ సారి ఆ పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు కానీ బీజేపీ రేంజ్ హిందూత్వ వాదాన్ని ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడు లడ్డూ వివాదంలో మాత్రం సనాతన ధర్మం గురించి మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరిచారు. పవన్ కల్యాణ్ దీర్ఖకాలిక రాజకీయ వ్యూహంతో ముందుడుగు వేస్తున్నారని.. ఆయన ఆలోచనల వెనుక ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఉందని అంటన్నారు. దీనికి కారణం.. దేశంలోని ప్రముఖ అథ్యాత్మిక ఆలాయలు అధ్యాత్మిక వాదుల చేతుల్లోనే ఉండాలని రాజకీయ జోక్యం ఉండకూడదన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో సనాతన రక్షణ బోర్డు ప్రస్తావనను పవన్ తీసుకు వచ్చారు. ఇది ఏపీకి కాదు.. దేశం మొత్తం గురించి ఆయన తెచ్చిన ప్రస్తావన. 

దక్షిణాదిన హిందూ ఫేస్‌గా ఉండే ప్రయత్నమా ?

లడ్డూ వివాదం నేపధ్యంలో పవన్  పదకొండు రోజుల పాటు.. దీక్ చేయాలని నిర్ణయించుకున్నారు. నంబూరు ఆలయంలో దీక్ష చేపట్టి పదకొండు రోజుల తర్వాత తిరుమలలో దర్శనం చేసుకుంటానన్నారు. ప్రాయశ్చిత్తమని పవన్ అంటున్నారు.  రాజకీయాల్లో ఎవరు ఔనన్నా.. కాదన్నా.. కుల, మత రాజకీయాలకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏ పార్టీ అయినా ఆ వ్యూహంలో భాగంగానే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. దానికి  పవన్ కల్యాణ్ అతీతడేమీ కాదు. ఆయన  ఎవర్నీ నొప్పించకుండా హిందువుల్ని ఆకట్టుకునే రాజకీయాలు చేయడానికి సిద్దమయ్యారని అనుకోవచ్చు. అయితే  పవన్ కల్యాణ్ తన స్పందన వెనుక ఎలాంటి రాజకీయం వ్యూహం ఉందని చేశారో కానీ.. రాజకీయంగా మాత్రం  చర్చనీయాంశం అవుతోందని అనుకోవచ్చు. 
   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget