అన్వేషించండి

Cockroach Janta Party: దేశానికి 'బొద్దింక' ముప్పు..? 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అసలేం జరిగింది?

Cockroach Janta Party Ban: కాక్రోచ్ జనతా పార్టీ -Cockroach Janta Party అంటూ సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమంతో దేశానికి ముప్పు ఉందా.. ? ఆ పార్టీ X ఖాతాను ఎందుకు నిలిపేశారు.

Cockroach Janta Party Twiitter Account Blocked:  నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. బొద్దింకల పార్టీ అంటూ.. ఆన్‌లైన్‌ కమ్యూనిటీ హోరెత్తుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ -Cockroach Janta Party అంటూ సోషల్ మీడియాలో మొదలైన ప్రచారం కొన్ని రోజుల్లోనే తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీల మించి ఫాలోయర్లు పెరిగిపోయారు. అయితే పెద్ద ఎత్తున హోరెత్తుతున్న ప్రచారాన్ని కేంద్రం ఆపేసింది. ఆన్‌లైన్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న  'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janta Party) ఎక్స్ (ట్విటర్) ఖాతాను ఇండియాలో నిలిపివేస్తూ (Withheld) కేంద్ర ఐటీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎందుకీ నిషేధం అంటే.  Why Cockroach Janta Party Twiitter account blocked ?
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సమాచార సాంకేతిక చట్టం (IT Act), 2000 లోని సెక్షన్ 69A ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఇచ్చిన కీలక నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ అకౌంట్ ద్వారా పోస్ట్ అవుతున్న కంటెంట్ తీవ్ర రెచ్చగొట్టేలా (Inflammatory content) ఉందని, ఇది దేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు భంగం కలిగించేలా మారిందని ఐబీ హెచ్చరించింది. ముఖ్యంగా యువతలో ఈ పేజీకి విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో, వారిపై దీని ప్రభావం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అత్యంత వేగంగా అమలు చేసింది.

రాత్రికి రాత్రే పెరిగిన ఫాలోవర్లు!

ముందుగా యువత ఎక్కువుగా వాడే Instagram లో ఇది బాగా పాపులర్ అయింది. రోజుకు రోజుకు లక్షల్లో కాదు.. మిలియన్లలో ఫాలోవర్లు అక్కడ పెరుగుతున్నారు. అయితే న్యూస్‌ను కొంచం సీరియస్‌గా తీసుకునే X ప్లాట్‌ఫామ్‌లో కూడా ఆదరణ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఖాతాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించిన ప్రారంభ సమయంలో దీనికి దాదాపు 90,000 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. కానీ, ఈ వార్త బయటకు వచ్చేసరికి ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2 లక్షలు దాటేసింది.  ఇప్పుడు విదేశాల్లో   ఈ అకౌంట్‌ను ఫాలో  అవుతున్న వారి సంఖ్య 8లక్షలు దాటింది.  ప్రస్తుతం ఈ అకౌంట్ భారతదేశ పరిధిలో అందుబాటులో లేనప్పటికీ, విదేశాల్లోని వినియోగదారులకు మాత్రం ఎక్స్ కంటెంట్ పాలసీల ప్రకారం యథావిధిగా కనిపిస్తోంది

అసలు ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' కథేంటి?

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ కిందటి నెలలో నిరుద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దీనంతటకీ కారణం. సుప్రీంకోర్టులోకి వచ్చిన ఓ పిటిషన్‌ పై కామెంట్ చేస్తూ .. నిరుద్యోగులను  'వ్యవస్థపై దాడి చేసే  బొద్దింకలు" అన్న సెన్స్‌లో కామెంట్ చేశారు. ఆ పరిణామాల క్రమంలోనే 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే సాటైరికల్ సోషల్ మీడియా హ్యాండిల్ పుట్టుకొచ్చింది. వ్యవస్థలోని లోపాలను రాజకీయ పరిణామాలను వ్యంగ్యంగా విమర్శిస్తూ ఈ పేజీ తక్కువ కాలంలోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. మహరాష్ట్రకు చెందిన 30 ఏళ్ల  అభిజీత్ దిప్కే  దీనిని ప్రారంభించారు. యుఎస్‌లోని  బోస్టన్‌లో ఉండే ఆయన ఇంతకు ముందు AAP పార్టీ కోసం పనిచేశారు. తన అకౌంట్ నిలిపివేతపై స్పందించిన అభిజీత్.. "మేము ముందే ఊహించినట్లుగానే 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ అకౌంట్ భారత్‌లో ఆపేశారు." అని తన పర్సనల్ అకౌంట్ ద్వారా తెలిపారు. అంతేకాదు, అకౌంట్ బ్లాక్ అయిన రెండు గంటల్లోనే 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' (Cockroach Is Back) పేరుతో సరికొత్త ఎక్స్ హ్యాండిల్‌ను ప్రారంభించి, ఫాలోవర్లను అందులోకి రమ్మంటూ ట్వీట్ చేశారు.

Instaలో దూకుడు.. 2కోట్లకు పైగా. Still Counting..

ఎక్స్ (ట్విటర్) లో ఈ పేజీని బ్లాక్ చేసినప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్‌లో దీని హవా ఇంకా కొనసాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పేజీకి ఏకంగా 2.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రభుత్వం దీనిని కూడా నిలిపేసే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. 

పాకిస్థాన్- బంగ్లాదేశ్ నుంచి ఫాలో అవుతున్నారా.. ?

కాక్రోచ్ పార్టీకి ఇంత వేగంగా.. స్పందన రావడం వెనుక కుట్ర ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ అకౌంట్లను ఫాలో అవుతున్న వారు ఎక్కువుగా బంగ్లాదేశ్- పాకిస్థాన్ నుంచి ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. భారత్‌లో జరుగుతున్న మూమెంట్‌కు సహజంగానే అక్కడ నుంచి స్పందన వస్తోందా.. లేదా ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా అనే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. 

సెక్షన్ 69A ఏం చెబుతోంది?
దేశ సార్వభౌమత్వం, సమగ్రత, దేశ రక్షణ, విదేశాలతో స్నేహసంబంధాలు, లేదా ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి ఆన్‌లైన్ కంటెంట్‌నైనా నిరోధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కల్పిస్తుంది. ఈ నిబంధనల ప్రకారమే అత్యంత రహస్యంగా ఈ బ్లాకింగ్ ఆర్డర్లను జారీ చేశారు. మొత్తానికి ఒక సాటైరికల్ పేజీ జాతీయ భద్రతకు ముప్పుగా మారిందంటూ కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కేంద్రం భయపడుతోందా..?

 నేపాల్ తరహాలో ఇక్కడ కూడా GenZ ఉద్యోమం ఊపందుకుుంటుందా అని కేంద్రం భయపడుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తు్న్నాయి. ప్రభుత్వాలు ఏ విషయాన్నైతే ఇన్నాళ్లూ దాచారో అదిప్పుడు బయటపడుతోందని.. యువత కామెంట్లు చేస్తున్నారు. దేశంలో నిరుద్యోగం రేటు తీవ్ర స్థాయిలో ఉందని.. అది 'బొద్దింకల పార్టీకి మద్దతు' రూపంలో బయటపడుతోందన్నారు. అందుకే కేంద్రం భయపడుతోందనే వాదన తెస్తున్నారు.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget