భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక వ్యాఖ్యల నేపథ్యంలో, అభిజీత్ దీప్కే అనే యువకుడు మే 16, 2024న CJPని ప్రారంభించారు. ఒక ట్వీట్ ద్వారా మొదలైన ఈ పార్టీ వేలాది యువతను ఆకట్టుకుంది.
Cockroach Janta Party: బీజేపీని క్రాస్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ! అసలు ఏంటీ సెటైరిక్ పొలిటికల్ మోమెంట్?
Cockroach Janta Party: సెటైరిక్‌గా మారిన కాక్రోచ్ జనతాపార్టీ ఇప్పుడు ఒక వర్గం గొంతుకలా మారింది. నాలుగు రోజుల్లోనే 90 లక్షల మంది ఫాలోవర్స్‌తో రికార్డులు బ్రేక్ చేస్తోంది.

- సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో బొద్దింక జనతా పార్టీని యువత ప్రారంభించారు.
- ఆప్ మాజీ సోషల్ మీడియా వాలంటీర్ అభిజీత్ దీప్కే పార్టీని స్థాపించారు.
- నిరుద్యోగం, పరీక్షల లీకేజీలపై అసంతృప్తితో యువత స్పందిస్తున్నారు.
- మీడియా, రిజర్వేషన్లపై సీజేపీ పలు రాజకీయ డిమాండ్లు చేసింది.
Cockroach Janta Party: భారత్‌లో చాలా రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ప్రత్యేక ఆశయం, లక్ష్యంతో ప్రజలను ఆకట్టుకున్నాయి. కానీ ఒక ట్వీట్‌తో పుట్టిన పార్టీ ఇప్పుడు సంచలనాలకు వేదికగా మారుతోంది. కోట్లా మందిని ఆకట్టుకుంటోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. దీని ప్రస్థానం 15మే 2026న ప్రారంభమైంది. నకిలీ డిగ్రీలకు సంబంధించిన ఒక కేసు విచారణ టైంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీని నుంచే పుట్టిందీ సీజేపీ.
ఉపాధి లేని కొందరు యువకులు బొద్దింకల వ్యవస్థపై దాడి చేస్తున్నారన సీజేఐ అన్నారు. సోషల్ మీడియా, ఆర్టీఐను ఆసరాగా చేసుకొని ఇబ్బంది పెడుతున్నారని కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ చాలా వేగంగా వైరల్ అయ్యాయి. దీన్ని అవమానంగా తీసుకున్న యువకులు విమర్శలు చేయకుండా బొద్దింక పేరుతో ఒక గ్రూప్‌ను ఫామ్ చేశారు. దీన్ని గుర్తింపుగా భావించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు.
సీజేపీని క్రియేట్ చేసిన అభిజీత్ దీప్కే
CJI కామెంట్స్ చేసిన మరుసటి రోజే అంటే మే 16న ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. బోస్టన్ యూనివర్శిటీలలో పబ్లిక్ రిలేషన్ చదువుతున్న 30 ఏళ్ల అభిజీత్ దీప్కే ఓ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న వారు పౌరులను బొద్దింకలుగా చూస్తే అవన్నీ ఒకటైతే ఎలా ఉంటుందనే ఆలోచన ఎక్స్‌లో పంచుకున్నారు. సీజేఐ కామెంట్స్‌పై సెటైరిక్‌గా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో యువతను ఆకట్టుకుంది.
అభిజీత్ దీప్కేకు గతంలో ఆప్ సోషల్ మీడియా విభాగంలో పని చేసిన అనుభవం ఉంది. తనకు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌తో గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్, లోగో, మేనిఫెస్టో సిద్ధం చేశారు. నిరుద్యోగులైన బొద్దింకల్లారా ఏకం అవ్వండి అన్న ఆయన పిలుపునకు భారత్ నుంచి విదేశాల్లో ఉన్న భారతీయుల వరకు అందరూ స్పందిస్తున్నారు.
సీజేపీకి ఎందుకు ఆదరణ పెరుగుతోంది?
ఈ ఉద్యమం ఇంతలా క్లిక్ అవ్వడానికి ప్రధాన కారణం యువత గూడుకట్టుకున్న అసంతృప్తి. దీనికి కొన్ని కీలకాంశాలు తోడయ్యాయి. భారత్‌లో డిగ్రీ చేసిన వారి నిరుద్యోగ రేటు 29.1 శాతానికి చేరుకుంది. ఇది చదువుకోని వారి కంటే 9 రెట్లు ఎక్కువ. నీట్ వంటి కీలక రీక్షళ పేపర్‌లు లీకేజీలు యువతలో వ్యవస్థపై ఉన్న నమ్మాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. ప్రధాన న్యాయమూర్తి చేసిన బొద్దింక వ్యాఖ్యను యువత తమకు జరిగిన అవమానంగా కాకుండా, తమ పట్టుదలకు నిదర్శనంగా తీసుకున్నారు. ఎంతటి విపత్తునైనా తట్టుకొని నిలబడగలదు బొద్దింక చనిపోదు అనే సందేశంతో నేను బొద్దింకనే అనే స్లోగన వైరల్ అయ్యింది.
సీజేపీకీ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి?
సీజేపీ కేవలం సరదా కోసమే ప్రారంభమైనా, వచ్చిన రెస్పాన్స్‌తో సీరియస్ రాజకీయ డిమాండ్లు ప్రభుత్వాల ముందు పెట్టారు. ఐదు అంశాలపై ఫోకస్ చేశారు. అందులో మొదటిది సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు వంటి పదవులు ఇవ్వకూడదు. ఓటరు జాబితా నుంచి పొరపాటున ఓట్లు తొలగిస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద అరెస్టు చేయాలి. పార్లమెంట్, క్యాబినెట్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న మీడియా సంస్థల లైసెన్స్‌ను రద్దు చేసి, స్వతంత్ర మీడియాకు ఊపిరి పోయాలి. పార్టీ మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి అనే డిమాండ్‌లు ప్రజల ముందు ఉంచారు.
బీజేపీ ఫాలోవర్స్‌ను మించిపోయిన సీజేపీ
మే 20 నాటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 90 లక్షల మంది ఫాలో వర్లను సంపాదించుకుందీ పార్టీ. అధికార బీజేపీకి 87 లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. కేవలం 72 గంటల్లోనే ఈ స్థాయిలో ఆదరణ పొందడం చాలా అనుమానాలకు తావిస్తోంది. జెన్‌జీ ఉద్యమానికి కారణం అవుతుందా అన్న కోణంలో కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్యమం కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాలేదు. ఢిల్లీలోని యమునా నదిని శుభ్ర చేయడానికి యువకులు బొద్దింక వేషధారణలో వచ్చి వినూత్న నిరసన చేపట్టారు.
కాక్రోచ్ జనతా పార్టీకి పోటీగా నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ ఎన్‌పీఎఫ్ అనే పార్టీ ఏర్పాటు అయ్యింది. ఇది కూడా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ రాజకీయ కామెంట్స్ చేస్తోంది. భారత్‌లో యువత తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి పాత పద్ధతులను కాకుండా, మీమ్స్, సెటైర్ ని ఎంచుకున్నారు. ఇది నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక జెన్‌జీ ఉద్యమాల కటే భిన్నమైంది. పరిణతి చెందినది అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ చెబుతున్నారు.
ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే, బలమైన సందేశాన్ని మాత్రం పంపించింది. నిరుద్యోగ యువతను చిన్నచూపు చూస్తే, వారు తమదైన శైలిలో తిరుగుబాటు చేస్తారనే ఈ ఉద్యమం నిరూపించింది.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
Frequently Asked Questions
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?
CJP ప్రారంభించడానికి గల ప్రధాన కారణం ఏమిటి?
నకిలీ డిగ్రీ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి యువతపై చేసిన వ్యాఖ్యలను అవమానంగా భావించిన యువకులు, విమర్శలకు బదులుగా 'బొద్దింక' పేరుతో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇది CJP స్థాపనకు దారితీసింది.
CJPకి ఇంత ఆదరణ ఎందుకు లభిస్తోంది?
భారతదేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, పరీక్షల పేపర్ లీకేజీలు యువతలో వ్యవస్థపై అసంతృప్తిని పెంచాయి. బొద్దింక వ్యాఖ్యను అవమానంగా కాకుండా, తమ పట్టుదలకు నిదర్శనంగా తీసుకోవడం CJP ఆదరణకు కారణమైంది.
కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రధాన డిమాండ్లు ఏమిటి?
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత పదవులు ఇవ్వకూడదు, ఓటరు జాబితా నుంచి ఓట్లు తొలగిస్తే ఎన్నికల కమిషనర్‌ను అరెస్ట్ చేయాలి, పార్లమెంట్‌లో మహిళలకు 50% రిజర్వేషన్, స్వతంత్ర మీడియాకు మద్దతు, పార్టీ మారిన MLA/MPలపై 20 ఏళ్ల నిషేధం వంటి డిమాండ్లు CJP ముందుకు తెచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















