అన్వేషించండి

What are the powers of Deputy CM : డిప్యూటీ సీఎం అధికారాలేమిటి ? ఎలాంటి ప్రోటోకాల్ లభిస్తుంది ?

Andhra Politics : డిప్యూటీ సీఎంగా పవన్ కు ఉండే ప్రత్యేకమైన అధికారాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో సమానమని చెబుతున్నారు.

What are the powers of Deputy CM :  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం  హోదా కల్పించారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన డిప్యూటీ సీఎం అని ప్రమాణం చేయలేదు. కేబినెట్ మంత్రిగానే ప్రమాణం చేశారు. కానీ ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి  ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉంటారు.. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. కానీ రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రులు తమ డిప్యూటీలను పెట్టుకోవచ్చు. వైసీపీ హయాంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ వారికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఏమీ లభించలేదు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. 

డిప్యూటీ సీఎం అంటే.. మంత్రులందరిలో కెల్లా ప్రథముడు అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ తన తో సమానమని చంద్రబాబు కూడా పదే పదే చెబుతూ వస్తున్నారు. శాఖల పరంగా కూడా అత్యంత కీలక శాఖలను కేటాయించారు. మామూలుగా హోంశాఖ నిర్వహించేవారు ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానంలో ఉంటారని అనుకుంటారు. కానీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు హోంశాఖ కేటాయించారు. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు చేతిలోనే ఉంది. పవన్ కల్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఇవ్నీ అత్యంత కీలకమైనశాఖలే. అందుకే  పవన్ ప్రాధాన్యం చంద్రబాబు తర్వాత స్థానంలో ఉంటుంది. 

డిప్యూటీ సీఎంలకు ఇచ్చే విలువ సీఎం ఇచ్చే అధికారాల్ని బట్టే ఉంటుంది. ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఉన్న ఐదుగురు డిప్యూటీ సీఎంలను చూసి అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు – ఈ ఐదు వర్గాలకూ డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు జగన్. జగన్ హయాంలో మొత్తం 9 మంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. పాముల పుష్పశ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, రెండు నుంచి మూడేళ్ల మధ్య డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. కానీ వీరెవరూ ఎప్పుడూ స్వతంత్రంగా తమ శాఖలపై సమీక్షలు నిర్వహించినట్లుగా కూడా ఎప్పుడూ మీడియాకు సమాచారం రాలేదు. తమ శాఖల్లో విధులు వారు ఎంత నిర్వర్తించారో స్పష్టత లేదు. ఎక్కువగా వారు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. 

అయితే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తే మాత్రం పలుకుబడి ఉంటుంది. పవన్ కల్యాణ్ తనతో సమానమని చంద్రబాబు చెబుతున్నారు. సీఎం స్థాయిలో కాకపోయినా కాస్త తక్కువగా ఆయినా పవన్ కల్యాణ్‌కు ప్రోటోకాల్ లభిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో పలుకుబడి లభిస్తుంది. అది రాజకీయంగా వచ్చే  హోదా. పవన్ కల్యాణ్‌కూ దీనిపై స్పష్టత ఉంది. ప్రస్తుతం ప్రోటోకాల్ వ్యవహారాల్లోనూ చంద్రబాబు తర్వాత పవన్ పేరే ఉంటోంది. అదే అసలైన డిప్యూటీ  సీఎం గౌరవం అనుకోవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget