Kishan Reddy Sorry Atchanna : తప్పు జరిగింది - అచ్చెన్నాయుడుకి కిషన్ రెడ్డి సారీ !
అచ్చెన్నాయుడుకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సారీ చెప్పారు. సమాచారలోపం వల్ల ఆయనకు అవమానం జరిగిందని వివరణ ఇచ్చారు.
![Kishan Reddy Sorry Atchanna : తప్పు జరిగింది - అచ్చెన్నాయుడుకి కిషన్ రెడ్డి సారీ ! Union Minister Kishan Reddy apologized to Achchennaidu. Kishan Reddy Sorry Atchanna : తప్పు జరిగింది - అచ్చెన్నాయుడుకి కిషన్ రెడ్డి సారీ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/468397c191558b210cf12b5669cd1fa91656932298_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KishenReddy Sorry Achenna : భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు టీడీపీ తరపున అచ్చెన్నాయుడును ఆహ్వానించి చివరికి జాబితాలో ఆయన పేరు లేదని అవమానించిన అంశం కలకలం రేపుతోంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాయడమే కాదు ఫోన్ చేసి ప్రతినిధిని పంపాలని కోరారు. ఆ ప్రకారం చంద్రబాబు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఎంపిక చేశారు. ఆయన కూడా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు. అయితే ప్రధాని మోదీకి స్వాగతం చెప్పేందుకు వెళ్లిన సమయంలో అచ్చెన్నను కలెక్టర్ ప్రశాంతి అడ్డుకున్నారు. తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు.
మోదీ ఆత్మీయతకు చిరంజీవి ఫిదా ! రాజకీయం మారే చాన్స్ ఉందా ?
ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజి ఇచ్చిన జాబితాలో కూడా అచ్చెన్నాయుడు పేరు ఉంది. కానీ పీఎంవో నుంచి వచ్చిన జాబితాలో పేరు లేదు. ఆ జాబితా కలెక్టర్ వద్ద ఉంది. ఎస్పీజీ జాబితాలో పేరు ఉన్న విషయం చెప్పినప్పటికీ తన జాబితాలో లేదని కలెక్టర్ తేల్చిచెప్పేశారు. దీంతో అచ్చెనాయుడు ఆగిపోయారు. బహిరంగసభకు కూడా హాజరు కాలేదు. ఈ అంశంపై అచ్చెన్నాయుడు మండి పడ్డారు. పిలిచి అవమానించడం ఏమిటని ప్రశ్నించారు.
పీఎంవో జాబితాలోనూ రఘురామ పేరు లేదెందుకు ? స్థానిక ఎంపీకి ప్రోటోకాల్ దక్కదా ?
పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నామని చెప్పి చివరికి .. ఆహ్వానం ఉన్న వారిని కూడా అవమానించడం కలకలం రేపింది. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మీడియా ముఖంగా అచ్చెన్నాయుడుకు క్షమాపణలు చెప్పారు. సమాచార లోపం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. పీఎంవో నుంచి వచ్చిన జాబితాలో పేరు లేకపోవడం వల్ల సమస్య వచ్చిందన్నారు. ఈ
సాఫ్ట్ స్పీచ్‌తో షాకిచ్చిన మోదీ ! విమర్శించలేదని టీఆర్ఎస్ నేతలు ఫీలవుతున్నారా ?
అయితే పిలిచి మరీ అవమానించారని ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎంపీ రఘురామ పేరు కూడా జాబితాలో లేదు. దీనిపై కిషన్ రెడ్డి స్పందించలేదు. మొత్తానికి రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన అల్లూరి విగ్రహావిష్కరణ వివాదాలతో ముగిసినట్లయింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర టూరిజం మంత్రిగా కిషన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.,అందుకే చిరంజీవి సహా పలువురిని పిలిచారు.చివరికి సరిగ్గా నిర్వహించలేకపోవడంతో ఆయనే క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)