TS BJP : యూపీ విజయంతో బీజేపీలో ఉరకలు ! ఇక హైకమాండ్ చూపు తెలంగాణ వైపేనా ?
దక్షిణాదిలో తాము అధికారం చేపట్టే అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ హైకమాండ్ నమ్మకం. అందుకే బీజేపీ ఇక తెలంగాణపై దృష్టి పెడుతుందని భావిస్తున్నారు.
పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ( BJP ) విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దక్షిణాదిలో బీజేపీ అధికారం చేపట్టబోయే రెండో రాష్ట్రం తెలంగాణ ( Telangana ) అని ఆ పార్టీ హైకమాండ్ చాలా నమ్మకంతో ఉంది . తెలంగాణలో కాషాయం జెండాను ఎగురవేయడమే ధ్యేయంగా బీజేపీ అడుగులు ఖాయమని చెప్పుకోవచ్చు. ఈ సారి ఎన్నికల్లో గెలిచేది తామేనని.. సర్కార్ ను ఏర్పాటు చేయడం పక్కా అని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.
నిజామాబాద్ కాంగ్రెస్ లో వర్గ పోరు, మధుయాష్కీపై క్రమశిక్షణ చర్యలకు డిమాండ్!
డబుల్ ఇంజిన్ ఫార్ములాను బీజేపీ నేతలు ప్రధానంగా ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాల్లోనూ ఉంటేనే అభివృద్ధి సాధ్యం నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ( Five State Elections ) కారణంగా తెలంగాణపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేదు. ఇక పూర్తి ఫోకస్ దక్షిణాదిపైనే ( South ) పెట్టాలని, అందులోనూ తెలంగాణనే టార్గెట్ చేయాలని హైకమాండ్ ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు ప్రభుత్వంపై అనేక రకాల పోరాటాలు చేస్తున్నారు.
కేసీఆర్‌కి అనారోగ్యమని తెలిసి ఆందోళన పడ్డా, సీఎం క్షేమంగా ఉండాలి: బండి సంజయ్
కేసీఆర్ ( KCR ) ఎన్నికల హామీల అమలు కోసం వీధి పోరాటాలు చేయాలని, నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉండాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు.. ఉద్యోగ ఖాళీలను త్వరగా భర్తీ చేసి నిరుద్యోగుల చేతికి ఆఫర్ లెటర్ వచ్చే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండనున్నాయి. బెంగాల్ తరహా వ్యూహాలను.. రాష్ట్రపతి ఎన్నికల ( President Elections ) తర్వాత అమలు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలకు నిరాశ - హైకోర్టు తీర్పుతో "ఆ అవకాశం" కోల్పోయినట్లే !
ఒక్కొక్క రాష్ట్రంలో పార్టీని విస్తరించుకోవడానికి బీజేపీ ( BJP ) ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్న తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకుని అధికారం సాధిస్తే.. ఇతర రాష్ట్రాలకూ విస్తరించవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో అమిత్ షా త్వరలో తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.