అన్వేషించండి

Nizamabad Congress : నిజామాబాద్ కాంగ్రెస్ లో వర్గ పోరు, మధుయాష్కీపై క్రమశిక్షణ చర్యలకు డిమాండ్!

Nizamabad Congress : నిజామాబాద్ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. మధుయాష్కీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ లో తీర్మానం చేయడంతో వివాదానికి దారితీసింది.

Nizamabad Congress : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు రచ్చకెక్కింది. ఇప్పటికే పార్టీ వైభవం కోల్పోయి చతికిల పడుతుంటే నేతల వర్గ పోరు కాంగ్రెస్ క్యాడర్ ను మరింత కుంగదీస్తోంది. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ లో తీర్మానం చేయటం ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాధిలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కుంగదీస్తుంటే   తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ వర్గపోరు పార్టీ శ్రేణులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మధుయాష్కీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ సమీక్షా సమావేశంలో ముఖ్య అథితిగా పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సమక్షంలోనే ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీపై మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ ఫైర్ అయ్యారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మధు యాష్కీ చేసిన వ్యాఖ్యలే ఈరవత్రి అనిల్ ఆగ్రహానికి కారణమయ్యాయి. రేవంత్ రెడ్డిపై మధుయాష్కీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశంలో తీర్మానం ఆమోదం చేయటం రచ్చకు దారితీసింది. మధుయాష్కీ వర్గం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించటం రచ్చకు దారితీసింది. 

రేవంత్ రెడ్డి నియామకంతో జోష్

అసలే జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే వీరి వర్గ పోరు పార్టీని మరింత డ్యామేజ్ చేస్తోందన్న భావన కార్యకర్తల్లో మొదలైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి జిల్లా కంచుకోటగా ఉండేది. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా పొలిటికల్ స్ట్రీట్ లో పార్టీ ఉనికినే కోల్పోయే స్థాయికి వచ్చింది. అయితే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీలో కాస్త జోష్ వచ్చింది. ఇతర పార్టీలవైపు చూసే నాయకులు ఆగిపోయారు. కానీ ప్రస్తుతం జిల్లాలో నేతల మధ్య తలెత్తుతున్న వర్గ పోరుకు సెకండ్ క్యాడర్ కు ఏం చేయాలో తోచటం లేదు.

మూడేళ్లుగా జిల్లా కాంగ్రెస్ లో వర్గ పోరు...

జిల్లా కాంగ్రెస్ లో మూడేళ్ల క్రితం నుంచి వర్గ పోరు మొదలైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మధుయాష్కీ పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్ గా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పసుపు బోర్డు కోసం రైతులు పార్లమెంట్ స్థానానికి పోటీలో ఉండటంతో  పార్లమెంట్ ఎన్నికల ఇంచార్చ్ బాధ్యతల నుంచి సుదర్శన్ రెడ్డి తప్పుకున్నాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ డిపాజిట్ కోల్పోయాడు. దీంతో మధుయాష్కీ, సుదర్శన్ రెడ్డిల మధ్య వైరం స్టార్ట్ అయ్యింది. 2021లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కీ నియామకం నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మధుయాష్కీలు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. జిల్లాలో ఏర్పాటు జరిగిన కాంగ్రెస్ సభలో మధుయాష్కీ పాల్గొనగా సుదర్శన్ రెడ్డి దూరంగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి నియోజకవర్గం అయిన బోధన్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మధుయాష్కీ పాల్గొనగా అందులోనూ సుదర్శన్ రెడ్డి అటెండ్ కాలేదు. తాజాగా జిల్లా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ లో మధుయాష్కీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న తీర్మాణం వెనుక మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

జిల్లాలో వర్గపోరు 

అయితే జిల్లా కాంగ్రెస్ లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్గం, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ వర్గాలుగా జిల్లా నాయకులు చీలిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. రేవంత్ రెడ్డి బంధువైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్, గడుగు గంగాధర్ రేవంత్ రెడ్డి వర్గంగా చీలిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. మరోవైపు మధుయాష్కీ వర్గంగా నగర అధ్యక్షుడు కేశ వేణు, మాజీ బీసీ సెల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కెప్టెన్ కరుణా కర్ రెడ్డి, మాజీ మంత్రి సంతోష్ రెడ్డి కోడుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచే టీపీసీసీలో కీలక బాధ్యత నిర్వహిస్తున్న మరో నేత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తటస్థంగా ఉన్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వర్గ పోరు జిల్లాలో ఇలాగే కొనసాగితే....రాష్ట్రం కాంగ్రెస్ పైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Kasturba Gandhi School: 300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Embed widget