By: ABP Desam | Updated at : 03 May 2022 05:30 PM (IST)
రేపటి నుంచి చంద్రబాబు జిల్లాల టూర్
శ్రీకాకుళం సెంటిమెంట్ ను నమ్ముకున్న చంద్రన్న రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచే తన టూర్ స్టార్ట్ చేస్తున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తారు. అక్కడ జరిగే బాదుడే బాదుడు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు.
సిక్కోలు నుంచి మొదలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో గల దల్లవలస గ్రామంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని నిరసన చేపడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకి వివరించనున్నారు.
బాదుడే బాదుడుతో ప్రజల్లోకి
పన్నులు, ఛార్జీలు పెంచేసి ప్రజల నడ్డివిరుస్తున్నారని బాదుడే బాదుడు పేరుతో టిడిపి నిరసనలను చేపడుతుంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇన్‌చార్జీగా ఉన్న ఆమదాలవలస నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు పర్యటించేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కూన రవికుమార్‌పై ఆయన విజయం సాధించారు. ఇక్కడ నుంచి టిడిపి తన నిరసనను గట్టిగా ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్మయించింది.
సెంటిమెంట్ టూర్
చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించి చాలా రోజులైంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండుసార్లు వచ్చినా శ్రీకాకుళంలో మాత్రం అడుగుపెట్టి చాలా రోజులైంది. అందుకే చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లి మళ్లీ పుంజుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మళ్లీ ప్రజాదరణకు ప్రయత్నం
తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలు కంచుకోట. 2004 తర్వాత ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 2014 ఎన్నికల సమయంలో బలం పుంజుకున్నా ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రం వైసీపీ సత్తాచాటుకుంది. 2019 ఎన్నికలలో వైసీపీ మైదాన ప్రాంతాలతోపాటు ఏజెన్సీ ఏరియాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. అందుకే మళ్లీ రీబూట్ కావాలని టీడీపీ భావిస్తోంది. రానున్న 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టీడీపీ.
చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనడం వెనుక కూడా శ్రీకాకుళం సెంటిమెంట్ ఉందని తెలుగుతమ్ముళ్ళు చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతం అవుతుందన్న భావన అందరిలోనూ ఉంటుంది. అది రాజకీయాలైనా ఇటు నిరసన కార్యక్రమాలైనా కూడా ఇక్కడ నుంచి ప్రారంభిస్తుంటారు. టిడిపి ప్రతిషా త్మకంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు అందుకే శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నట్లుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది కూడా ఆమదాలవలస నియోజకవర్గాన్ని ఎంచుకోవడం కూడా ఆసక్తి రేపుతుంది.
ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే స్పీకర్ తమ్మినేని సీతారాం మేనల్లుడు కూన రవికుమారే టీడీపీ తరఫున అభ్యర్థి. ఆయనే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు. అందుకే ఈ పర్యటనను టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పర్యటన విజయవంతం చేసేందుకు కూన రవికుమార్ విస్తృత కసరత్తు చేశారు.
Anantapur TDP Kalva : ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !
Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?
Undavalli Arun Kumar : ఏపీలో మూడు పార్టీలూ బీజేపీకే మద్దతు - తనను బెదిరిస్తున్నారని ఉండవల్లి ఆవేదన !
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!