Vijayawada Central Seat: వంగవీటి రాధా, బొండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్
Vijayawada News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ...బెజవాడ రాజకీయాలు సెగలు పుట్తిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమా, వంగవీటి రాధా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది.
![Vijayawada Central Seat: వంగవీటి రాధా, బొండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ TDP News Social Media War Between Vangaveeti Radha And Bonda Uma followers for vijayawada central seat Vijayawada Central Seat: వంగవీటి రాధా, బొండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/24/82a11baefcdd8f9ce18cbc91e81259f91706070474259840_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Social Media War In TDP : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections 2024)వేళ...బెజవాడ రాజకీయాలు సెగలు పుట్తిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమా (Ex Mla Bonda Uma), వంగవీటి రాధా (Vangaveeti Radhakrishna) వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ అసెంబ్లీ సీటు కోసం రాధా, ఉమా వర్గీయుల మధ్య పోరు ముదురుతోంది. వంగవీటి రాధాను టీడీపీ నమ్మకపోవడానికి గల కారణాలంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు సర్యూలేట్ చేస్తున్నారు. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ...3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
బోండా వర్గీయులకు రాధా అనుచరుల కౌంటర్
బోండా ఉమా వర్గీయులే పోస్టులు పెట్టారంటూ వంగవీటి రాధా వర్గం మండిపడుతోంది. రాధాను టీడీపీకి దూరం చేసేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. రాధాను నమ్మాలంటే ఏం చేయాలంటూ...బోండా ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్ అయ్యాయి. రాధాపై ఏడు పాయింట్లతో పోస్టులు పెడితే...పదిహేడు పాయింట్లతో ఉమాపై పోస్టులు పెట్టారు. దీంతో విజయవాడ సెంట్రల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
బోండాపై రాధా అనుచరుల పోస్టులు
దేవుడి పేరుతో చందాలు పోగు చేసి దోచేయాలా ? స్థలాలు కబ్జా చేయాలా ? చిన్నపిల్లల చావుకు కారణం అవ్వలా ? కాల్ మన నిందితులకు కొమ్ముకాయాలా ? కల్తీ మద్యం కేసులో నిందితులకు కొమ్ముకాయాలా ? సామాజిక రాజకీయ బిక్షపెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడవలా ? రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని తిట్టాలా ? స్వలాభం కోసం రాజకీయ భవిష్యత్ ఇచ్చిన నేతను...కులం ముసుగు తిట్టి..కులానికి పార్టీకి విరోధం పెంచాలా ? కులాన్నిఅధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించాలా ? అంటూ బోండా ఉమాపై పోస్టులు పెట్టారు ?పార్టీ మీద, పార్టీ నాయకుల మీద పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించాలా ? పార్టీలో ఉన్న నాయకులను వాడుకొని వదిలేయాలా ? స్వలాభం కోసం పార్టీని అమ్మేసిన నీచ స్వభాగం...పార్టీ పెద్దలకు తెలిసేసరికి...ఈసారి టికెట్ రాదని అధికారపార్టీతో మంతనాలు జరపాలా అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
రాధాపై బోండా ఉమా అనుచరుల పోస్టులు
వంగవీటి రాధా గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడలేదు. గుడివాడలో జరిగిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి సభకు చంద్రబాబు చెప్పినా...తన మిత్రుడు నాని రావొద్దు అన్నాడని రాధా పాల్గొనలేదు. యువగళం పాదయాత్రలో విజయవాడలో లోకేశ్ కు కనిపించి...తన మిత్రుడు వంశీ రావొద్దు అన్నాడని గన్నవరం సభకుహాజరుకాలేదు. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా...మంగళగిరి పార్టీ ఆఫీసుపై దాడి జరిగినా స్టేట్ మెంట్ ఇవ్వలేదు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేదు. ఇపుడు కూడా రాదా, నాని, వంశీలు కలిసే ఉండటం...కాశీ గుడికివెళ్లడం టీడీపీ శత్రువులతో తిరగడం టీడీపీ నమ్మకపోవడానికి కారణం అంటూ పోస్టులు వైరలయ్యాయి.
Also Read: కాంగ్రెస్‌లోకి కీలక నేతలు - సగం చోట్ల బలమైన అభ్యర్థుల్ని షర్మిల పోటీ పెట్టగలరా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)