అన్వేషించండి

Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం

Andhra Pradesh Elections 2024: టీడీపీ అభ్యర్థులపై చంద్రబాబు ప్రకటన విడుదల చేయడంతో అనంతపురంలో పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ కార్యాలయంపై దాడులకు దిగారు.

TDP MP Candidates - అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) నాలుగో విడత అభ్యర్థుల ప్రకటనతో అనంతపురం (Anantapur) జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాదని, బిజినెస్ మ్యాన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంతో అనంతపురం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 
చంద్రబాబు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన అనంతరం వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు భారీగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు చేరుకుని పెద్ద ఎత్తున చంద్రబాబుని, నారా లోకేష్ (Nara Lokesh) ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు నగరంలోని జిల్లా తెలుగుదేశం కార్యాలయంపై కూడా దాడి చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో కార్యాలయం గేట్లు బండరాలతో పగలగొట్టి లోపల ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను ఫర్నిచర్ ను కార్యాలయం ఎదురుగా వేసి నిప్పట్టించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ సీఎం చంద్రబాబు ఉన్న పార్టీ కార్యాలయం హోర్డింగ్ ను సైతం అదే మంటలలో వేసి తగలబెట్టారు. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకొని నిరసనను వ్యక్తం చేశారు. 

స్థానికులకు కష్టపడిన వారికి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో కేసులు పెట్టించుకుని ధైర్యంగా నిలబడిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా కేటాయిస్తారని వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కార్యకర్తలపై తమపై ఎన్నో కేసులు బనాయించిన ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నందుకు చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. రేపటి రోజున తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణలను ప్రకటిస్తానని వెల్లడించారు.

గుంతకల్లు నియోజకవర్గంలోనూ పరిస్థితి 
గుంతకల్లు నియోజకవర్గంలోనూ పార్టీ ఇంచార్జ్ జితేంద్ర గౌడ్ కి కాదని వైసీపీ నుంచి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం కు టిడిపి అధినేత టికెట్ను ప్రకటించారు. దీంతో గుంతకల్లు నియోజకవర్గం లో ఒకసారి గా తెలుగుదేశం పార్టీ వర్గీయులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ముంతకల్లు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. గతంలో నారా చంద్రబాబు నాయుడుని లోకేష్ ను ఇష్టం వచ్చినట్లుగా దూషించిన వ్యక్తికి పార్టీలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించడం ఏంటని ప్రశ్నించారు.

చీపురుపల్లిలో భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ పదవులకు కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. నాగార్జున వెంటే మేము అంటూ నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షులు,నాయకులు రాజీనామాలు చేస్తామంటున్నారు. నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కరపత్రాలను, జెండాలను తగలబెట్టారు తెలుగుతమ్ముళ్లు. కళా వద్దు నాగార్జునే ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎచ్చెర్ల వదిలేసి చీపురుపల్లి వచ్చావంటూ కళా వెంకట్రావ్ పై నాగార్జున ఫైర్ అయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget