అన్వేషించండి

Manifestos of Tamil parties: ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?

Tamil parties free-promise manifestos: ఆకర్షణీయమైన హామీలు ఇస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారన్నట్లుగా తమిళ పార్టీ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నాయి. కానీ చరిత్ర చెబుతోంది మాత్రం వేరే.

Will the Tamil parties free-promise manifestos bring in a shower of votes :  తమిళనాడు రాజకీయాలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉచితాల పర్వం . మిక్సీలు, గ్రైండర్లు, టీవీల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు.. అక్కడి పార్టీలు ఇచ్చే హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంటాయి. అయితే, కేవలం ఆకర్షణీయమైన హామీలు ఇస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకటే భారీ హామీలు ఇచ్చిన పార్టీలు కూడా గతంలో ఓడిపోయాయి. తమిళ తంబీల రాజకీయ చైతన్యం వెనుక ఉన్న అసలు రహస్యం నమ్మకం . ఎంతటి బీభత్సమైన హామీలు ఇచ్చినా, ఆ పార్టీ దాన్ని నెరవేర్చగలదా లేదా అనే తర్కాన్ని ప్రజలు క్షుణ్ణంగా విశ్లేషించి కానీ తీర్పు ఇవ్వరు. గత కొన్ని దశాబ్దాల ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

హామీల యుద్ధం - ఓటమి పాఠాలు 

2006లో డీఎంకే ఉచిత కలర్ టీవీల హామీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉచితాల ట్రెండ్ పెరిగింది. అయితే, 2011లో అదే డీఎంకే మరిన్ని ఆకర్షణీయమైన హామీలు ఇచ్చినా ప్రజలు పట్టం కట్టలేదు. దానికి కారణం అప్పట్లో ఉన్న అవినీతి ఆరోపణలు,  పాలనపై వ్యతిరేకత. అంటే, ఉచితాలు ప్రజలను ఆకర్షించినప్పటికీ, ప్రభుత్వంపై నమ్మకం పోతే ఆ హామీలు గట్టెక్కించలేవు. అలాగే కొన్ని చిన్న పార్టీలు ప్రతి కుటుంబానికి కారు ,  నెలకు భారీ నగదు  వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చినా, తమిళ ఓటర్లు వాటిని ఏనాడూ సీరియస్ గా తీసుకోలేదు.

విశ్వసనీయతకి పట్టం

తమిళనాడులో జయలలిత , కరుణానిధి వంటి దిగ్గజ నేతలు సక్సెస్ కావడానికి కారణం వారు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడమే. అమ్మ క్యాంటీన్లు, ఉచిత ల్యాప్‌టాప్‌ల వంటి పథకాలను జయలలిత సమర్థవంతంగా అమలు చేయడం వల్ల  ఆమె చెబితే చేస్తారు  అనే ముద్ర పడింది. అదేవిధంగా, స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూడా  చెప్పేదే చేస్తాం.. చేసేదే చెబుతాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించింది. ఇక్కడ పథకం కంటే కూడా ఆ పథకాన్ని అమలు చేసే నేత విశ్వసనీయతకే ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారు.

సోషల్ ఇంజనీరింగ్ , సంక్షేమం 

తమిళనాడు ఓటర్లు కేవలం వస్తువుల కోసమే ఓటు వేయరు. ఆ పథకం తమ సామాజిక స్థితిగతులను ఎలా మారుస్తుందో ఆలోచిస్తారు. ఉదాహరణకు, ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎలా దోహదపడుతుందో వారు గుర్తిస్తారు. సంక్షేమ పథకాలను కేవలం  ఉచితాలు గా కాకుండా,  సామాజిక పెట్టుబడి గా మార్చడంలో అక్కడి పార్టీలు సఫలమయ్యాయి. అయితే, ఈ పథకాల అమలుకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు మేధావుల నుంచి వచ్చినా, సామాన్య ఓటర్లు మాత్రం తమ జీవితాల్లో మార్పు తెచ్చే పార్టీ వైపే మొగ్గు చూపుతారు.   ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో తమిళ ఓటరు మరింత పదును దేలాడు. ఆచరణ సాధ్యం కాని హామీలను  మీమ్స్ ద్వారా ఎద్దేవా చేస్తున్నారు.  ఒక పార్టీ ఉచితాలు ఇస్తానంటే, దానికి ప్రతిగా ఆ పార్టీ ట్రాక్ రికార్డును యువత తవ్వి తీస్తోంది. గతంలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు? ప్రస్తుత హామీకి బడ్జెట్ ఎంత? వంటి లెక్కలను సోషల్ మీడియా వేదికగా విశ్లేషిస్తున్నారు.  రాజకీయ పార్టీలు కూడా కేవలం భ్రమలు కల్పించే హామీలు కాకుండా, ఆచరణాత్మకమైన ప్రణాళికలతో ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

తమిళనాడు రాజకీయాలు నేర్పే పాఠం ఒక్కటే..  ఓటరును ఉచితాలతో కొనలేరు, కానీ నమ్మకంతో గెలవగలరు . హామీలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయన్నది కాదు, ఆ హామీ వెనుక ఉన్న చిత్తశుద్ధి  ఎంత అనేది ముఖ్యం. ఏ పార్టీ అయితే తన మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి, అందులోని అంశాలను నెరవేరుస్తుందో, ఆ పార్టీకే తమిళ ప్రజలు మళ్లీ మళ్లీ అవకాశం ఇస్తారు. ఈ సూత్రం కేవలం తమిళనాడుకే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఒక పాఠం లాంటిది అనుకోవచ్చు.  

 

టాప్ హెడ్ లైన్స్

BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
BJP New National Executive: నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget