అన్వేషించండి

Center statement on fuel issue: కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన

Petrol shortage: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇంధన సరఫరాపై తలెత్తిన ఆందోళనలతో స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

Centre clarification on petrol shortage:  రెండు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న భారీ క్యూలు, ఇంధన కొరతపై నెలకొన్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి   సుజాతా శర్మ మీడియా ద్వారా దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

భారత్‌లో కావాల్సినంత ఇంధన నిల్వలు 

భారతదేశానికి ఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే  సామర్థ్యం ఉందని సుజాతా శర్మ గుర్తుచేశారు. ఈ సామర్థ్యం మన దేశ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని నిరంతరాయంగా అందించగలదని ఆమె పేర్కొన్నారు. పెట్రోల్ బంకులకు ఇంధనాన్ని సరఫరా చేసే టెర్మినల్స్‌లో కూడా తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా గొలుసులో ఎలాంటి ఆటంకాలు లేవని ఆమె వివరించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, క్షేత్రస్థాయిలో కొరత ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం తేల్చిచెప్పింది.

పానిక్ బయింగ్ వల్లే సమస్య 

గత రెండు రోజులుగా చాలా ప్రాంతాల్లో రిటైల్ అవుట్‌లెట్ల వద్ద ప్రజలు గంటల కొద్దీ వేచి ఉండటం,  పానిక్ బయింగ్ అంటే భయంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడంకు దిగడం వల్లే కొన్ని చోట్ల తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తాయని ప్రభుత్వం గుర్తించింది. అవసరం లేకపోయినా ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని, దీనిని కొరతగా భావించి మరింత ఆందోళన చెందవద్దని సుజాతా శర్మ కోరారు. పుకార్లను నమ్మి బంకుల వద్ద రద్దీ పెంచవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ధరల పెంపు లేదు 

ఇంధన ధరలు పెరగబోతున్నాయనే వార్తలపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ఏదీ లేదని, పాత ధరలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ధరల పెంపు భయంతో కూడా చాలా మంది స్టాక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్రం సూచించింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ, దేశీయంగా వినియోగదారులపై భారం వేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రాలకు ఆదేశాలు 

తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచాలని, బంకుల వద్ద శాంతిభద్రతలను పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కొన్ని చోట్ల ఆయిల్ కంపెనీలు బంకుల నుంచి నగదు ముందస్తుగా వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులపై కూడా అధికారులు దృష్టి సారించారు. నిరంతరాయంగా సరఫరా జరిగేలా ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నామని, ప్రజలు సంయమనం పాటించాలని కేంద్రం కోరింది.

కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో పెట్రోల్ మంటలకు కొంతమేర ఉపశమనం లభించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో బంకుల వద్ద నిల్వలు వేగంగా నింపేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం ఇప్పుడు అధికారుల ముందున్న సవాలు. నిరంతరాయంగా ఇంధనం అందుబాటులో ఉంటేనే ఈ ఆందోళనకర పరిస్థితులు సద్దుమణుగుతాయి.  

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
Breaking News: నేడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం
నేడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం
Cristiano RonaldoWorld Cup History: 41 ఏళ్ల ఏజ్‌లో రొనాల్డో మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్.. క్రొయేషియాపై గోల్ తో పోర్చుగల్ కింగ్  హిస్టరీ క్రియేట్ 
41 ఏళ్ల ఏజ్‌లో రొనాల్డో మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్.. క్రొయేషియాపై గోల్ తో పోర్చుగల్ కింగ్  హిస్టరీ క్రియేట్ 
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
Sierra EV Launch: టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Embed widget