అన్వేషించండి

Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 

Raw NTR Shot Down: రా ఎన్టీఆర్ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నింటిని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ నిర్వాహకుడు ప్రకటించాడు. ఇందులో విజయం సాధించిన వారికి ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రా ఎన్టీఆర్, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ప్రచారం చేయగా, కార్యాలయం ఖండించింది.
  • సంస్థ నిర్వాహకుడు సాయిరూప్ “ఊరు వాడ” కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
  • వెనక్కి తగ్గని సంస్థ హఠాత్తుగా తన కార్యకలాపాలను పూర్తిగా ఆపివేసింది.

Raw NTR Shot Down: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడనే వార్త వైరల్ అయ్యింది. ఎన్టీఆర్‌ను గట్టిగా సపోర్ట్ చేసే రా ఎన్టీఆర్ పేరుతో రన్ అయ్యే ఆర్గనైజేషన్ చేసిన హడావుడి దీనికి ఊతమిచ్చింది. తిరుపతిలో ప్రెస్‌మీట్ ఉందని, దీనికి ఎన్టీఆర్ వస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని అసలు రా ఎన్టీఆర్‌తో తమకు సంబంధం లేదని కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది. ఇంత జరిగినా రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్టీఆర్ తరుఫున తామే ఊరు వాడ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ స్వయంగా ఆపేయాలని ప్రకటిస్తే మొత్తం ఆపేస్తామని తెలిపారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మొత్తం అన్నింటిని ఆపేస్తున్నట్టు రా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.

ప్రస్‌మీట్ పెట్టి వివరాలు చెప్పిన రాఎన్టీఆర్ ఆర్గనైజర్

జూలై 18న తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టిన రా ఎన్టీఆర్ ఆర్గనైజర్‌ సాయిరూప్ కీలక విషయాలు ప్రస్తావించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసే ఆలోచనతో దీన్ని రాఎన్టిఆర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. అలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఊరు వాడ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. దీనికో వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. 

ఎన్టీఆర్ చెప్పే వరకు తగ్గేదేలే అన్న సాయిరూప్

ఎన్టీఆర్ జిల్లా నుంచే ఊరు వాడ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు సాయిరూప్‌ తిరుపతిలో ప్రకటించారు. దీనిపై ఎన్టీఆర్ అడిగితే రెడీ చేసిన సినిమా స్క్రిప్టు మాదిరి మొత్తం ఈ ఊరు వాడ ప్లాన్ వివరిస్తామని పేర్కొన్నారు. అంతా విన్న తర్వాత ఆపే సాయి వెంటనే ఒక హగ్ ఇచ్చి అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేస్తానంటూ తెలిపారు. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు అన్నా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తా అని అన్నారు. 

రాత్రికి రాత్రే మూసేసిన రా ఎన్టీఆర్

ఎన్టీఆర్ చెప్పే వరకు ఊరు వాడ ఆపేది లేదు, వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పిన వ్యక్తి రాత్రికి రాత్రే మొత్తం షట్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అభిమానుల ఒత్తిడి మేరకు ఇలా చేశారా? లేకుంటే ఎన్టీఆర్ ఏమైనా మాట్లాడాడా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి రచ్చ వద్దని కోపడ్డాడా అనే విషయంపై కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు. 

అన్నింటిని షట్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించిన రా ఎన్టీఆర్ ఆర్గనైజర్‌, ఇందులో విజయం సాధించిన వారందరికీ ధన్యవాదాలు అని చెప్పడం కొసమెరుపులా ఉంది. ఇది ఎవర్ని ఉద్దేశించిన చేసిన కామెంట్‌ అనే డిస్కషన్ జరుగుతోంది.  మొత్తానికి ఒక్క ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన రా ఎన్టీఆర్ ఊరు వాడ ఎపిసోడ్ ప్రస్తుతానికి అలా ముగిసింది.       

Frequently Asked Questions

రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఎందుకు నిలిచింది?

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై వార్తల నేపథ్యంలో, ఆయన్ను బలపరిచే రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ హడావుడి చేయడంతో వార్తల్లోకి వచ్చింది. తిరుపతిలో ప్రెస్‌మీట్ ఉంటుందని ప్రచారం చేసింది.

రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్‌పై ఎన్టీఆర్ కార్యాలయం స్పందన ఏమిటి?

రా ఎన్టీఆర్‌తో తమకు సంబంధం లేదని, తిరుపతిలో ప్రెస్‌మీట్ లాంటిదేమీ లేదని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటించింది. ఇది ప్రచారాన్ని ఖండించింది.

రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ చేపట్టిన

రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛంద సేవ చేయడమే

రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ సేవలను ఎందుకు నిలిపివేసింది?

ఎన్టీఆర్ చెప్పేవరకు ఆగనన్న సాయిరూప్, కొద్దిరోజుల్లోనే అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానుల ఒత్తిడి లేదా ఎన్టీఆర్ ఆదేశాలు కారణమై ఉండవచ్చు.

రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ తన ప్రకటనలో

షట్‌డౌన్ ప్రకటనలో

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget