Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నారట. సోషల్ మీడియాలో విద్వేష ప్రచారాలపై పోలీసు శాఖ సరిగ్గా స్పందించడం లేదన్నది ఆయన కంప్లయింట్. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారితో నేరుగానే చెప్పారని సమాచారం

Pawan Kalyan Dissatisfaction: కూటమిలో కొద్దిపాటి కుదుపు.. హోం శాఖ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీసులపై కినుక వహించారని తెలుస్తోంది. సోషల్ మీడియా కేసుల విషయంలో దూకుడుగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖలోని టాప్ బాస్‌ల దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన రెస్పాన్స్ రావడం లేదని ఆయన ఆగ్రహంగా ఉన్నాట.
కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో రావణ్ అంశం నడుస్తోంది. ఓ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దానికి జనసైనికులు ఆగ్రహం చెందడం.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత నిషేధిత సంస్థల ఐడియాలజీని ప్రోత్సహించేలా.. వీడియోలు రూపొందించారన్న విషయంపై రావణ్‌పై UAPA చట్టం కింద కేసు నమోదు (RavanUAPA Case) చేసే వరకూ అది దారితీసింది.ఈ విషయానికే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్న తరుణంలో.. ఇప్పుడు కూటమికి మరో సమస్య వచ్చింది.
పవనాగ్రహం..
సోషల్‌మీడియాలో చేస్తన్న వ్యాఖ్యలు, తనపైన కానీ ప్రభుత్వంపైన కానీ.. సోషల్ హార్మోనీని దెబ్బతీసేలా పనిచేస్తున్న వారి విషయంలో కానీ పోలీసులు అనుకున్నంత వేగంగా.. స్పష్టంగా పనిచేయడం లేదని పవన్ కల్యాణ్ భావిస్తన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశ్న రావణ్ ఒక్కరే కాదు.. మరికొందరిపై కూడా కేసులు నమోదు చేయాలన్నది ఆయన అభిమతమని.. ఆ విషయంలో పోలీసు శాఖ చొరవ చూపిచడం లేదన్న అసంతృప్తి ఆయనలో ఉంది. ఈ విషయాన్ని ఆయన నేరుగా ఓ పోలీసు ఉన్నతాధికారినే అడిగారని కూడా తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన విషయం ప్రకారం ఆయన చాలా సీరియస్‌గానే దీనిపై మాట్లాడారని.. కానీ పోలీసుల నుంచి తాను ఆశించిన సమాధానం రాలేదని తెలిసింది. దీనికి పవన్ కల్యాణ్ నొచ్చుకున్నారని చెబుతున్నారు. ఆ తర్వాత దానిని సర్దుబాటు చేయడానికి జనసేన- టీడీపీ నుంచి రెండు వైపులా ప్రయత్నాలు జరిగాయి.
తెలంగాణలో అరెస్టుల రచ్చ.. అందుకే ఏపీ పోలీసులు వెనకడుగు వేస్తున్నారా?
పోలీసులు ఈ విషయంలో మరింత దూకుడుగా లేకపోవడానికి కారణం.. చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తులు తెలంగాణలో ఉండటం. ఇప్పటికే రావణ్, జర్నలిస్ట్ KVR అరెస్టుల వ్యవహారం తెలంగాణలో రచ్చకు దారితీసింది. ఏపీ పోలీసులు ఇష్టారాజ్యంగా వచ్చి ఇక్కడ నుంచి మనుషులు తీసుకెళ్తున్నారంటూ.. పొలిటికల్ పంచాయతీ నడిచింది. ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకు వేస్తే అది అనవసరంగా ఇబ్బందులకు దారితీస్తుందని వారు భావిస్తున్నారు.
UAPA చట్టం ప్రయోగం.. కూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!
సాధారణంగా అరుదుగా నమోదు చేసే UAPA చట్టాన్ని రావణ్‌పై పెట్టడంపై చర్చ నడుస్తోంది. దీనికి సరైన జస్టిఫికేషన్ పోలీసులు ఇవ్వాల్సి ఉంటోంది. చాలా మంది మాజీ IPS, ప్రజా సంఘాల వారు ఈ చర్యను తప్పు పడుతున్నారు. దీనిపై విజయవాడలో రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. UAPAని రాజకీయ ప్రయోనాల కోసం వాడుతున్నారన్న భావనను ఈ సమావేశం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వం, పోలీసు శాఖపైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పుడు కొత్త తలనొప్పులు తలకెత్తుకోవడం ఎలా అని.. పోలీసు శాఖ అనుకుంటోంది. అదే సమయంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీని ఒప్పించడం సవాల్‌గానే ఉంది.
కూటమి ప్రభుత్వంలో ఇంతకు ముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. వాటిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్లియర్ చేసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్ తన సర్జరీ కోసం ముంబై వెళ్లడంతో ఇవాళ కేబినెట్ మీటింగ్ కు హాజరుకాలేదు. ఇది ముందుగానే షెడ్యూల్ అయిన విషయం అయినా ఈ టైమ్‌లోనే ఇలా జరగడం కూడా కూటమిలో కొంచం కుదుపుకు కారణం అయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















