Telangana బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ అరవింద్‌కు షాక్.. అంతలోనే టీఆర్ఎస్‌లో చేరిన నేతలు
బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించిన ఒకట్రెండు రోజుల వ్యవధిలో నందిపేట బీజేపీ ఎంపీటీసితో పాటు, బీజేపీ నాయకత్వం మొత్తం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరింది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ భారీ షాక్ తగిలింది. ఇద్దరు ఎంపీలు పర్యటించిన ఒకట్రెండు రోజుల వ్యవధిలో నందిపేట బీజేపీ ఎంపీటీసితో పాటు, బీజేపీ నాయకత్వం మొత్తం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డిల సమక్షంలో నందిపేట ఎంపీటీసి-2 అరుణ చావన్ గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఎంపీ బండి సంజయ్‌ను, ఆ పార్టీ నేతలు, కార్తకర్తలే నమ్మడం లేదని టీఆర్ఎస్ కీలక నేతలు అంటున్నారు.
ఇటీవల ఆర్మూర్‌లో పర్యటించిన ఎంపీ అరవింద్ ను స్థానిక పసుపు రైతులు అడ్డుకున్నారు. పసుపు బోర్డు హామీని నెరవేర్చాలంటూ అరవింద్ ను నిలదీశారు. దీంతో కొందరు అరవింద్ అనుచరులు, రైతులు పరస్పరం దాడులకు దిగారు. అయితే అరవింద్ ను అడ్డుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు రైతులను ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చిన ఎంపీ బండి సంజయ్, ఆర్మూర్ లోని నందిపేటలో పర్యటించారు. కానీ వారి మాటలు తాము నమ్మడం లేదని స్థానిక రైతులు చెప్పారు. పసుపు బోర్డుతో రాజకీయం చేసి గెలిచారని ఆరోపించారు.
రైతులను ఉగ్రవాదులతో పోల్చి రాజకీయ లబ్ది కోసం తమ గ్రామంలో పర్యటించిన బండి సంజయ్ తీరును గ్రామ బీజేపీ నాయకులు సైతం తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా గ్రామ ఎంపీటీసి, ఇతర బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. తమను ఎంపీ అరవింద్ తీవ్రంగా మోసం చేశారని, పసుపు బోర్డు రావడం లేదని రైతులు అవేదన వ్యక్తం చేశారు. నందిపేట ఎంపీటీసి2 అరుణ నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పసుపు బోర్డు పేరుతో గెలిచి, రైతులను తీవ్రంగా మోసం చేసిన ఎంపీ అరవింద్, బీజేపీ పార్టీ నేతలకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్ కూడా రాదని రైతులు పేర్కొన్నారు. హామీలు నెరవేర్చక పోవడమంటే ప్రజలను మోసం చేయడమేనని స్థానిక రైతులు ఎంపీలు బండి సంజయ్, అరవింద్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నందిపేట్ జెడ్పిటిసి యమున ముత్యం, ఎంపిటీసి మురళి, టీఆర్ఎస్ పార్టీ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్, సిలిండర్ లింగం తదితరులు పాల్గొన్నారు.
Also Read: Harish Rao: తెలంగాణలో ఆ సర్జరీలు చేయవద్దు.. శిశువుల్లో రోగ నిరోధకశక్తి తగ్గుతుంది: మంత్రి హరీష్ రావు
Also Read: Singareni Jobs 2022: సింగరేణిలో భారీగా ఉద్యోగ నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్.. పోస్టుల వివరాలివే