Harish Rao: తెలంగాణలో ఆ సర్జరీలు చేయవద్దు.. శిశువుల్లో రోగ నిరోధకశక్తి తగ్గుతుంది: మంత్రి హరీష్ రావు

జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్‌ డెలివరీలు బాగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందించారు.

FOLLOW US: 

Zaheerabad Govt Hospital: జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్  జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం భినందనీయం అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్. కరోనా సెకండ్ వేవ్ లో 500  మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందన్నారు. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డామని.. ఈ పరిస్థితి గమనించి‌సీఎం కేసీఆర్ ఆక్సిజన్ ఉత్పత్తి 500 మెట్రిక్ టన్నులకు పెంచాలని ఆదేశించారని పేర్కొన్నారు. ప్రస్తుతం‌ 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్నాం. మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు.

జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్‌ డెలివరీలు బాగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందించారు. అనవసరంగా సెక్షన్ సర్జరీలు చేయవద్దన్నారు. దీని వల్ల‌ తొలి ‌గంటలో శిశువుకు ‌అందాల్సిన అమృతమైన పాలు అందడం లేదని, దీనివల్ల‌ శిశువులో రోగ నిరోధకశక్తి తగ్గిపోతుందన్నారు. రాష్ట్రంలో‌ 66 శాతం మంది‌ శిశువులకు తొలి‌గంటలో పాలు అందడం‌ లేదని తద్వారా శిశువులలో రోగ నిరోధకశక్తి తగ్గి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెప్పారు. 

‘రాష్ట్రంలో 27  వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదు‌. వైద్య రంగంలో‌గుణాత్మక మార్పులు తెచ్చాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు‌ చేపట్టిన ఫీవర్ సర్వే (Fever Survey In Telangana) మంచి ఫలితాలు ఇస్తోంది. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గింది. అయినా అలసత్వం వద్దు. అందరం మాస్క్ ధరిద్దాం, వాక్సిన్ వేయించుకుందాం. దేశంలో వైద్య సేవలలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో నిలవాలని’ వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు సూచించారు.

కేసీఆర్ కిట్‌తో పెరిగిన డెలివరీలు
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. 50  పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు‌ చేస్తామని.. సీఎం అందిస్తున్న కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో‌ డెలివరీలు పెరిగాయి. ప్రస్తుతం‌ 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని‌ 75 శాతానికి పెంచాలన్నారు. అనవసర సర్జరీల వల్ల‌ 35 ఏళ్లకే తల్లి ఆ రోగ్యం దెబ్బతింటుందన్నారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌ కింద ఏరియా ఆస్పత్రిలో‌ చికిత్సలు చేయాలని ఆదేశించారు. డిపార్ట్మెంట్ల వారీగా పని తీరును అడిగి‌ తెలుసుకున్నారు. మందుల‌ కొరత, నిధుల‌ కొరత తెలంగాణ ప్రభుత్వం రానివ్వదని, చక్కటి‌ వైద్యం పేదలకు అందించాలని సిబ్బందికి‌ మంత్రి హరీష్ రావు ‌సూచించారు. వృత్తిని, ఉద్యోగ ధర్మాన్ని మరువవద్దని ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందుతుందని మాట ఇచ్చారు.

Also Read: Viral: నీ తెలివి సూపర్ బాసూ... ఉద్యోగం సాధించేందుకు ఎంత పని చేశావ్

Also Read: Singareni Jobs 2022: సింగరేణిలో భారీగా ఉద్యోగ నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్.. పోస్టుల వివరాలివే

Published at : 30 Jan 2022 03:31 PM (IST) Tags: telangana telangana news kcr TS News harish rao Zaheerabad KCR KIT Oxygen Generation Plant Zaheerabad Govt Hospital Zahirabad

సంబంధిత కథనాలు

మునుగోడులో ఎవరి బలం ఎంత- ఈ సారి ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు?

మునుగోడులో ఎవరి బలం ఎంత- ఈ సారి ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు?

Breaking News Telugu Live Updates: రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఆమోదించిన స్పీకర్ పోచారం

Breaking News Telugu Live Updates: రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఆమోదించిన స్పీకర్ పోచారం

Rajagopal Reddy Resignation: రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి - వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం

Rajagopal Reddy Resignation: రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి - వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం

Woman Rape: యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అత్యాచారం, స్నేహంగా మెలిగితే ఇంత దారుణమా !

Woman Rape: యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అత్యాచారం, స్నేహంగా మెలిగితే ఇంత దారుణమా !

Petrol Price Today 08 August 2022: వాహనదారులకు ఊరట! పలుచోట్ల తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇలా

Petrol Price Today 08 August 2022: వాహనదారులకు ఊరట! పలుచోట్ల తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇలా

టాప్ స్టోరీస్

Telugu Movies This Week : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే

Telugu Movies This Week : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే

Constable Murder: నంద్యాలలో కలకలం - బీర్ బాటిల్స్‌తో దాడి, కత్తులతో పొడిచి కానిస్టేబుల్ దారుణ హత్య! 

Constable Murder: నంద్యాలలో కలకలం - బీర్ బాటిల్స్‌తో దాడి, కత్తులతో పొడిచి కానిస్టేబుల్ దారుణ హత్య! 

NTA JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NTA JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Sita Ramam Box Office Collection : 'సీతా రామం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - ఓవ‌ర్సీస్‌లో హిట్టు! మరి, ఇండియాలో?

Sita Ramam Box Office Collection : 'సీతా రామం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - ఓవ‌ర్సీస్‌లో  హిట్టు! మరి, ఇండియాలో?