అన్వేషించండి

Minister Erraballi: ఎర్రబెల్లి పొలిటికల్ సర్వే‌లో మతలబేంటి? ఆ మాటల వెనక అధిష్ఠానమే ఉందా?

హాట్ టాపిక్ గా మారిన మంత్రి మాటల వెనుక అసలు మర్మం ఏమిటీ? బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను మంత్రి ఎర్రబెల్లి చెప్పకనే చెప్పారా? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ ఇప్పుడు వరంగల్ అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆలోచనలో పడేశాయి. హాట్ టాపిక్ గా మారిన మంత్రి మాటల వెనుక అసలు మర్మం ఏమిటీ? బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను మంత్రి ఎర్రబెల్లి చెప్పకనే చెప్పారా? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

సర్వేలలో పార్టీ చరిష్మా తగ్గిందా?
సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలతోపాటు, పీకే సర్వేలో పార్టీ ఛరిష్మా తగ్గిందని తేలడం వల్లే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఈ వ్యాఖ్యలు చేయించారని అంటున్నారు. వివిధ రకాల చర్చలతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని సృష్టిస్తుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలకు అంతరార్థం ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యేలలో టెన్షన్‌తో పాటు ఆశావహులలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఓరుగల్లు రాజకీయ రంగంలో కీలక నేతగా ఎర్రబెల్లి
రాజకీయాల్లో అపజయం ఎరుగని నేతగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెలుగొందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా విజయం ఆయన సొంతం. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎర్రబెల్లి, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన వెంటే ప్రజలున్నారని నిరూపించారు. జన హృదయనేతగా గుర్తింపు పొందిన ఎర్రబెల్లిని టీఆర్ఎస్ లోకి సీఎం కేసీఆర్ ఆహ్వానించి మంత్రి పదవి కట్టబెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా మారారు. ఓరుగల్లు పాలిటిక్స్ ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంది. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేతగా ఎర్రబెల్లికి గుర్తింపు ఉంది. పోలిటికల్ గా ఎంతో అనుభవం ఉన్న ఆయనకు సీఎం కేసీఆర్ కూడా విలువ ఇస్తారని పార్టీలో చెప్పుకుంటున్నారు. 

ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది సిట్టింగ్ లను మార్చితే 100 సీట్లు గ్యారంటీ అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు తన సర్వేలు తప్పు కాలేదంటూ ఆయన ప్రకటించడంపై పెద్ద దుమారమే లేచింది. సీఎం కేసీఆరే ఎర్రబెల్లితో సర్వే చేయించారా.. లేక ఆయనే సొంతంగా సర్వే చేయించారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఎవరా 20 మంది ఎమ్మెల్యేలు అన్న చర్చ రచ్చ రచ్చ అవుతోంది. అయితే అధిష్ఠానం సూచన మేరకే ఎర్రబెల్లి దయాకర్ రావు అలా మాట్లాడి ఉంటాడన్న వాదన కూడా ఉంది.

పనీ తీరు సరిగ్గా లేని ఎమ్యెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలు
ఓ వైపు సీఎం కేసీఆర్ పలుమార్లు సిట్టింగులకే సీట్లు ఇస్తామంటూ ప్రకటించారు. ప్రజల్లో వారికున్న వ్యతిరేకతను గుర్తించిన సీఎం కేసీఆర్ సైతం ఇప్పటికే వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పని తీరును మార్చుకోవాలంటూ దిశా నిర్దేశం  చేశారు. ఆయన సూచనలతో పార్టీ కార్యాలయాలను వీడిన ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవల్ లో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోతూ పార్టీ ప్రతిష్ఠతకు పాటుపడుతున్నారు. ఈ తరుణంలో మంత్రి ఎర్రబెల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఎర్రబెల్లి వ్యాఖ్యలు పెను దుమారం రేపాయా?
ఎర్రబెల్లి వ్యాఖ్యలపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ఎర్రబెల్లిక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారు మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని ఆయన అంచనా వేశారన్న ప్రచారం సాగుతోంది. అందుకే అలాంటి వారిని మార్చేయాలని సీఎం కేసీఆర్ కు ఎర్రబెల్లి సూచన చేసినట్లు సమాచారం. అయితే ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను కూడా ఆయన సూచించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఎర్రబెల్లి అసంతృప్తిగా ఉన్న సదరు ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఓరుగల్లు పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు రిజర్వ్ ఎమ్మేల్యే లతో పాటు ఒకరు బీసీ, మరోకరు  ఓసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిని  మార్చకపోతే బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లుతుందని ఎర్రబెల్లి ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. అయితే ఎర్రబెల్లి చెప్పినట్లు అయా స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక అందులో కొందరిని మార్చుతారా అనే ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాలపై రాజకీయాలు విశ్లేషకులు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెతను గుర్తు చేస్తుండగా సొంత పార్టీ నాయకుల మాత్రం అంతా ఉట్టిదేనంటూ కొట్టిపడేస్తున్నారు.

టికెట్ ఆశిస్తున్న వారికి గంపెడు ఆశలు.. దయాకర్ రావు వ్యాఖ్యల పుణ్యమా అని
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆశావహుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. సిట్టింగులను పక్కనపెడితే తమకే టికెట్ వస్తుందన్న ఆనందంలో ఉన్నారు కొందరు ఆశావాహులు.   ఆశావహులను అలర్ట్ చేసేందుకు ఎర్రబెల్లి అలా వ్యాఖ్యానించి ఉంటాడని భావిస్తున్నారు. పార్టీని నమ్ముకొని ఉన్నందుకు రానున్న రోజుల్లో మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారట మరికొందరు నాయకులు. అయితే వారి అశలు నెరవేరుతాయా లేదా అన్నది సీఎం కేసీఆర్ పై ఆధారపడి ఉంది.

దయాకర్ రావు మాటలు ఎవ్వరికి మేలు చేస్తాయి? ఎవరికి కీడు చేస్తాయి?
ఎర్రబెల్లి దయాకర్ రావు కేవలం 20 మందిని ఉద్దేశించి మాట్లాడలేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పదని అంటున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని, గ్రామాలలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు అలానే ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ కమలనాథులు ప్రచారం సాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్.. ఆశావహులలో టికెట్ వస్తుందనే ఆశా రెట్టింపు అయిందనే టాక్ నడుస్తోంది. మంత్రి ఎర్రబెల్లి మాటలు ఎటువైపు దారి తీస్తాయోనని జనంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
KTR vs Kavitha political war: కవిత వర్సెస్ కేటీఆర్ - ఈ రాజకీయం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించబోతోందా?
కవిత వర్సెస్ కేటీఆర్ - ఈ రాజకీయం బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించబోతోందా?
BJP To Change Madhya Pradesh Rajasthan Chief Ministers: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎంల మార్పు ఖాయమా? మోదీ-షా కొత్త ప్రయోగం వికటించిందా!?
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎంల మార్పు ఖాయమా? మోదీ-షా కొత్త ప్రయోగం వికటించిందా!?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget