Looking Ahead to 2025 in andhra Pradesh: అమరావతి నుంచి పోలవరం వరకూ - టన్నుల ఆశలతో 2025లోకి ఆంధ్రప్రదేశ్!
Looking Ahead to 2025l AP: గడిపోయినవి జ్ఞాపకాలు. రాబోతున్నది మాత్రం భవిష్యత్. ఈ భవిష్యత్ లోనే భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని ఏపీ పెద్ద పెద్ద ప్రణాళికలు రెడీ చేసుకుంది.
Looking Ahead to 2025 in andhra Pradesh: జరిగిపోయిన కాలంలో చేసిన పనుల నుంచి తప్పొప్పులు నేర్చుకుని, వచ్చిన విజయాలు, పరాజయాలను విశ్లేషించుకుని రాబోయే ఏడాదిలో మరిన్ని మంచి ఫలితాలు, విజయాలు సాధించేందుకు అందరూ ప్రణాళికలు వేసుకుంటారు. ఏపీ ప్రజలు, ప్రభుత్వం కూడా 2024లో పడిన పెద్ద ముందడుగు నుంచి 2025లో గొప్ప ఫలితాలను ఆశిస్తున్నారు.ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నుంచి గుండెకాయ లాంటి అమరావతిని నిర్మించుకోవాలని.. కనీసం ఓ కొలిక్కి తెచ్చుకోవాలన్న నమ్మకంతో ఉన్నారు. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణలో ముందడుగు వేసి ఉపాధి పరంగా యువతను బిజీగా ఉంచాలని అనుకుంటున్నారు.
పట్టాలెక్కుతున్న పోలవరం
పోలవరం ప్రాజెక్టు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తీరని కల. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే కరవు రహిత ఆంద్రప్రదేశ్ ను చూడవచ్చని దశాబ్దాలుగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు కాస్త పరుగులు పెట్టాయి. ఆర్ అండ్ ఆర్ గురించి పక్కన పెడితే ప్రధాన ప్రాజెక్టు దాదాపుగా 70 శాతం పూర్తయిన సమయంలో ప్రభుత్వం మారింది. మళ్లీ ఐదేళ్లు అయ్యే సరికి ఎక్కడిది అక్కడే ఉండటం కాకండా .. పనులు జరగకపోవడంతో పలు రకాల సమస్యలు వచ్చాయి. ఇప్పుడు వాటిని పరిష్కరించుకుని పనులు ప్రారంభిస్తున్నారు. డయాఫ్రం వాల్ కొత్తగా నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్ కు నిధుల సమస్య కూడా లేకుండ చూసేందుకు కేంద్రం భరోసా ఇస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణం 2025 ఏడాది మొత్తం శరవేగంగా జరుగుతందని ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు.
అమరావతికి ఓ రూపు వస్తుందని ఆశాభావం
ఏపీ ప్రజలు గత ఐదేళ్లుగా ట్రోల్ కు గురయిన అంశం రాజధాని. గత టీడీపీ ప్రభుత్వం ఖరారు చేసిన రాజధానిని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టిది. మూడు రాజధానుల పేరుతో రాజకీయ ఆట ఆడటంతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఒకే రాజధాని అమరావతి నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కూటమికి అన్ని ప్రాంతాల్లోనూ సంచలనాత్మక తీర్పు వచ్చింది. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అమరావతిని దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టింది. కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి నిధులను సమీకరించుకుంటున్నారు. రూ.పదిహేను వేల కోట్లను వివిధ ఆర్థిక సంస్థల నుంచి సాయంగా అందించేందుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. వాటికి సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇతర మార్గాల ద్వారా మరికొన్ని నిధులు సమీకరిస్తున్నారు. మొత్తంగా నలభై వేల కోట్ల రూపాయల విలువైన పనులను జనవరి నుంచి ప్రారంభించబోతున్నారు. మొత్తం పాలనా రాజధానికి మూడేళ్లలోపు ఓ రూపు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి ఏడాదిలోనే అంటే 2025లోనే విజిబుల్ డెలవప్‌మెంట్ చూపించాలన్న టార్గెట్ తో పనులు చేయించే అవకాశాలు ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి అయి.. జనవరి నుంచే పనులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
పరిశ్రమలు, పెట్టుబడులపై ఎన్నో ఆశలు
వైసీపీ హయాంలో రావాల్సిన పెట్టుబడులన్నిటినీ వెనక్కి పంపేశారని ఆరోపణలు గుప్పించిన టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం .. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తామని చెబుతోంది. గత ఆరు నెలల కాలంలో ఎన్నో పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. విశాఖకు సాఫ్ట్ వేర్ దిగ్గజాలు అయిన టీసీఎస్, గూగుల్ తో పాటు పలు ప్రముఖ కంపెనీలు రానున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కొన్ని వేల కోట్ల విలువైన భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు అమోదం తెలిపారు. వాటిలో కొన్ని అయినా మెటీరియలైజ్ అయితే యువతకు ఉద్యోగ అవకాశాల లభిస్తాయి.
రాజకీయంగానూ పెను మార్పులు ఖాయమేనా ?
2925లో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మార్పులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఒత్తిడి ఎదుర్కోనున్నారు. ఓ వైపు పార్టీ కేసులు.. మరో వైపు పార్టీ నేతల జంపింగుల.. మరో వైపు షర్మిల రాజకీయ పోరాటంతో ఆయన పార్టీని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ జాతీయ రాజకీయాల వైపు చూసే అవకాశాల్ని కూడా కొట్టి పారేయలేమన్న వార్తలు వస్తున్నాయి.