అన్వేషించండి

BRS Political Plan : ఇక ప్రజల్లోకి కేసీఆర్ - టార్గెట్ బీజేపీనా ? కాంగ్రెస్ నా ?

Telangana : కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన టార్గెట్ బీజేపీనా ? కాంగ్రెస్‌నా అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.

KCR target BJP or Congress  : బీఆర్ఎస్ పార్టీ కొంత కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత కవిత అరెస్టు.. పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం.. సగం చోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీకి ఊహించని దెబ్బ. కోలుకోవాలంటే..ముందుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం స్థైర్యాన్ని కూడదీసుకోవాలి. ఓ వైపు కుమార్తె కవిత జైల్లో ఉంటే.. కేసీఆర్ బయటకు రాలేకపోయారు. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడు కవిత రిలీజయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి రావడమే మిగిలిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీని టార్గెట్ చేస్తారన్నది కీలకంగా  మారింది. 

వడ్డీతో సహా చెల్లిస్తానని బీజేపీకి సవాల్ చేసిన కవిత 

బెయిల్ పై విడుదలైన తర్వాత కవిత ఢిల్లీలోనే తనను అక్రమంగా జైలుకు పంపారని.. వడ్తో సహా చెల్లిస్తానని బీజేపీకి హెచ్చరికలు పంపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై కేసులు పడటం.. అరెస్టు చేయడం వెనుక కాంగ్రెస్ కు ఎలాంటి పాత్ర లేదు కాబట్టి.. అంతా బీజేపీనే చేస్తోందని.. గతంలో ఆరోపించి ఉన్నారు కాబట్టి కవిత చేసిన సవాల్ బీజేపీకే అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె కానీ.. ఇతర బీఆర్ఎస్ పెద్దలు కానీ  బీజేపీ పేరు మాత్రం పలకలేదు. కవిత చేసిన సవాల్ కూడా వివాదాస్పదమయింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీనే నిందిస్తోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం పెద్దగా బీజేపీపై విమర్శలు చేయడం లేదు. 

కోర్టు పట్ల కనీస గౌరవం లేదా? సీఎం రేవంత్‌పై సుప్రీంకోర్టు సీరియస్

బీజేపీని పల్లెత్తు అనకుండా ప్రజల్లోకి వెళ్తే అనేక సందేహాలు

తన బిడ్డను బీజేపీ జైల్లో పెట్టిందని కేసీఆర్‌కు పీకల దాకా కోపం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయాలకు అనుగుణంగా వ్యూహాలు ఖరారు చేసుకుంటారని అందుకే బీజేపీపై ఇరప్పుడు ఎలాంటి కామెంట్లు చేయడం లేదని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి  కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తే .. ప్రజల్లో అనేక చర్చలు జరుగుతాయి. బిడ్డను జైల్లో పెట్టిన పార్టీని కాకుండా కాంగ్రెస్ ను మాత్రమే విమర్శిస్తే ఎలా అన్న ప్రశ్న వస్తుంది.  ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి లేదన్న వాదన ఉంది. ఇంకా ఏడాది కూడా అవ్వని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ  ప్రజల్లోకి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుందన్న వాదన కూడా ఉంది. 

గణేష్ మండపాలకు రేవంత్ రెడ్డి గుడ్‌ న్యూస్ - ఉత్సవాలపై సమీక్షలో సీఎం

బీజేపీపై యుద్ధం ప్రకటిస్తేనే రాజకీయంగా ఊపు !

కారణం ఏదైనా  పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ సరళి చూస్తే. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును మెల్లగా బీజేపీ కైవసం చేసుకుంటోంది. తమ పార్టీ ఓట్లను  బీఆర్ఎస్సే బీజేపీకి  మళ్లించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదే  నిజమైనా.. బీఆర్ఎస్ కు ముప్పే. ఇలాంటి సమయంలో కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తనే.. తమ పార్టీ క్యాడర్ లో ఉన్న సందేహాలను  పటా పంచలు చేసినట్లవుతుంది. గతంలో బీజేపీపై పలుమార్లు యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు అలాంటి యుద్ధం ప్రకటించాల్సి ఉంది. లేకపోతే ఇప్పటి వరకూ జరిగిన  విలీనాలు, పొత్తుల అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. అదే సమయంలో బీఆర్ఎస్ ప్లేస్ ను క్రమంగా బీజేపీ ఆక్రమించుకంటూనే ఉంటుంది. ఒక వేళ కేసీఆర్ రంగంలోకి దిగి.. కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తే.. అది బీజేపీకే ప్లస్ అవుతుంద్న అబిప్రాయం ఉంది. 

రాజకీయ చాణక్యుడిగా  కేసీఆర్ వ్యూహాలు ఏ దిశగా అమలు చేస్తారోనని బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget