అన్వేషించండి

TDP Politics: జేసీ పవన్ కుమార్ రెడ్డికి నో ఛాన్స్! అనంతపురం లోక్‌సభ బరిలో బీసీ నేత!

JC Pavan Kumar Reddy: అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తాడా.. జేసీ పవన్ కుమార్ రెడ్డికి చంద్రబాబు ఏం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది.  

Anantapur Politics: అనంతపురం: రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాలలో జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) ఫ్యామిలీ ఒకటి. జేసీ దివాకర్ రెడ్డి పేరు చెప్పగానే ఏపీలో రాజకీయంగా తెలియని వారు ఉండరు. ఆ కుటుంబం నుంచి గత ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి (JC Pavan Kumar Reddy) పోటీ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తాడా.. జేసీ పవన్ కుమార్ రెడ్డికి చంద్రబాబు ఏం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది.  

గత ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు జేసీ పవన్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు. గత సంవత్సరం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి రాజకీయంగా యాక్టివ్ అవుతారని జేసీ పవన్ రెడ్డి వర్గం చెబుతూ వస్తోంది. గత కొద్ది కాలంగా చేసి పవన్ రెడ్డి పార్టీ మారుతున్నారని కూడా ప్రచారం జోరుగా సాగింది. జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటారంటే కూడా చర్చ నడిచింది.. జేసీ పవన్ కుమార్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండడం పార్టీ మారుతున్నారన్న వార్తలు రావడంతో  కొంతమంది అనంతపురం పార్లమెంటు అభ్యర్థులుగా కొందరు పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. 

అనంతపురం పార్లమెంటు బరిలోకి ఎవరు? 
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనంతపురం పార్లమెంటు నుంచి ఎవరిని బరిలోకి దింపాల అని సర్వేలు కూడా చేయించినట్టు సమాచారం.  చంద్రబాబు నాయుడు కూడా ఈ ఎన్నికల్లో కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని టికెట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాలతో అనంతపురం పార్లమెంటు సమన్వయకర్తగా పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ నియమించారు. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరహాలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా బిసి నాయకులనే బరిలో దించుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బోయ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య చేతిలో ఓటమి చవిచూశారు. 

చంద్రబాబుతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ 
ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో జేసీ పవన్ కుమార్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న చంద్రబాబుని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న ఎన్నికల్లో జేసీ పవన్ కుమార్ రెడ్డికి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇవ్వాలని జేసీ పవన్ రెడ్డి చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ అంశాన్ని సున్నితంగా తోసిపుచ్చినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు అభ్యర్థులుగా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యతిని బరిలో దించుతునట్లు జేసీ పవన్ కుమార్ రెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. 

ఇప్పటికే అనంతపురం జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలోని ఇద్దరు సీనియర్ నాయకుల పేర్లు  పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బికే పార్థసారథి, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన కుటుంబంలో భాగంగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్చించిన అనంతరం మరి కొద్ది రోజుల్లోనే అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో సుదీర్ఘ రాజకీయ అనుభవన జేసీ కుటుంబం దీన్ని ఎలా తీసుకుంటుందో అని జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget