అన్వేషించండి

రెగ్యులర్ పాలిటిక్స్‌పై జగన్ పోకస్- త్వరలోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులతోపాటు, ప్రభుత్వ పరంగా ఖాళీగా ఉన్న పదవులు, నామినేటెడ్ పదవులపై సీఎం ప్రత్యేక శ్రద్ద చూపించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోవాలని మంత్రులకు ఈ మధ్య సూచించిన ఆయన... తను కూడా ఫుల్‌టైం వాటిపైనే ఫోకస్ పెట్టేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు.  వచ్చే నెల మూడో వారం నుంచి నేరుగా నేతలతో మాట్లాడనున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. తెలంగాణాలో ఎన్నికలకు షెడ్యూల్ ఒకట్రెండు నెలల్లో విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు అంటూ ఊహాగానాలు ఉండనే ఉన్నాయి. అందుకే అక్కడి పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. యాత్రలు, సమావేశాలు అంటూ ప్రతిపక్షాలు ప్రజల్లో ఉండేలా స్కెచ్ వేస్తున్నాయి. దీనికి దీటైన ప్రతివ్యూహాన్ని సిద్ధం చేస్తోంది అధికార పార్టీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌. 

రాజకీయ కోణంలో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ ఖరారయ్యిందని అంటున్నారు. వచ్చే నెల ఆగస్ట్ 15 తరువాత నుంచి జగన్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ అభ్యర్దులతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాలకు సంబంధంచిన జగన్ ప్రత్యేకంగా నివేదికలను కూడా తెప్పించుకున్నారని అంటున్నారు. 

స్వాతంత్య్ర దినోత్సవం తరువాత నుంచి ఫుల్ టైం రాజకీయాలపైనే జగన్ షెడ్యూల్ ఉంటుదని చెబుతున్నారు. ఈలోగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవహరాన్ని కూడా జగన్ సెట్ చేస్తారని అంటున్నారు. కొందరు శాసన సభ్యులు, పార్టీ పదవుల వలన ఇబ్బంది ఫీల్ అవుతున్నామని ఇప్పటికే జగన్‌కు వివరించారు. 

మీడియా, సోషల్ మీడియా
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్రభావం అధికంగా కనపడుతోంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మీడియా, సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కలిసే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియా రాజకీయాలపై ప్రభావం ఎక్కువగా ఉన్న వేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనే విషయాలపై కూడా చర్చిస్తారట. 

పార్టీ పదవులు- నామినేటెడ్ పదవులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులతోపాటు, ప్రభుత్వ పరంగా ఖాళీగా ఉన్న పదవులు, నామినేటెడ్ పదవులపై సీఎం ప్రత్యేక శ్రద్ద చూపించనున్నారు. ఇప్పటి వరకు కొన్ని సామాజిక వర్గాల వరకే పరిమితమైన కీలక నామినేటెడ్ పదవులను ఎన్నికల సమయానికి ముందు వెనుకబడిన సామాజిక వర్గాలకు అప్పగించనున్నారు. ఒకే సామాజిక వర్గానికి పార్టీలో అందలం ఎక్కిస్తున్నారనే అభిప్రాయాలను కూడా పరిగణంలోకి తీసుకొని ఆఖరి నిమిషంలో ప్రయార్టీ ఉన్న పదవులు అప్పగించబోతున్నారు. పెండింగ్‌లో ఉన్న పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల వ్యవహరాన్ని కూడా క్లియర్ చేస్తారని భావిస్తున్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయానికి పెరిగిన తాడికి
ఇప్పటికే ఎన్నికల సందడి పెరిగిపోయింది. దీంతో పార్టీని నమ్ముకున్న వారు తమకు పెండింగ్‌లో ఉన్న సమస్యల పై కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. అలాంటి వారిని రిసీవ్ చేసుకొని, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి, సమస్యను పరిష్కరించటం ద్వార ప్రజల్లో సంతృప్తి శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ పూర్తి స్థాయి రాజకీయాల పై ఫోకస్ పెడుతుండటంతో పార్టీలోని కీలక నేతలు సైతం ఆయా అంశాలపై ఇప్పటికే స్టడీ చేయటం ప్రారంభించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Terrorists arrested in Sathya Sai district: సత్యసాయి జిల్లాలో కలకలం - ఇద్దరు జేషే సానుభూతిపరుల అరెస్ట్
సత్యసాయి జిల్లాలో కలకలం - ఇద్దరు జేషే సానుభూతిపరుల అరెస్ట్
Telangana Bandh: శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
Konda Surekha Controversy: కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
Viran News: ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై  మహిళ ప్రసవానికి యువకుడి సాయం- డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మహిళ ప్రసవానికి యువకుడి సాయం - డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
Advertisement

వీడియోలు

Virat Kohli Tweet | India vs Australia | విరాట్ కోహ్లీ సంచలన ట్వీట్
India vs Australia ODI | Virat Records | ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ సచిన్‌ను అధిగమిస్తాడా ?
Priyank Kharge vs Nara Lokesh on Google | పెట్టుబడులపై పెద్దయుద్ధం..వైజాగ్ vs బెంగుళూరు | ABP Desam
Haryana IPS officer Puran Kumar Mystery | ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ కేసులో ట్విస్ట్ | ABP Desam
కాంట్రాక్ట్‌పై సైన్ చేయని కోహ్లీ.. ఆర్సీబీని వదిలేస్తున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Terrorists arrested in Sathya Sai district: సత్యసాయి జిల్లాలో కలకలం - ఇద్దరు జేషే సానుభూతిపరుల అరెస్ట్
సత్యసాయి జిల్లాలో కలకలం - ఇద్దరు జేషే సానుభూతిపరుల అరెస్ట్
Telangana Bandh: శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
Konda Surekha Controversy: కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
Viran News: ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై  మహిళ ప్రసవానికి యువకుడి సాయం- డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మహిళ ప్రసవానికి యువకుడి సాయం - డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
No More ORS Drinks: చక్కెర పానీయాలకు 'ORS' లేబుల్ నిషేధం - ఫలించిన హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం
చక్కెర పానీయాలకు 'ORS' లేబుల్ నిషేధం - ఫలించిన హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం
Sena tho Senani: సేనానితో కలిసి సేవలు చేసే సేనలో భాగం అవ్వాలనుకుంటున్నారా ? - ఇదిగో మీకో చాన్స్
సేనానితో కలిసి సేవలు చేసే సేనలో భాగం అవ్వాలనుకుంటున్నారా ? - ఇదిగో మీకో చాన్స్
Gujarat Jains: కార్లు కొనాలనుకునేవాళ్లు ఈ ప్లాన్ పాటిస్తే లక్షలు ఆదా - గుజరాతీలు 186 కార్లు కొని రూ.21 కోట్లు మిగుల్చుకున్నారు !
కార్లు కొనాలనుకునేవాళ్లు ఈ ప్లాన్ పాటిస్తే లక్షలు ఆదా - గుజరాతీలు 186 కార్లు కొని రూ.21 కోట్లు మిగుల్చుకున్నారు !
Chhattisgarh Naxals surrender: చత్తీస్‌ఘడ్‌లో  ఆశన్నతో సహా 208 మంది నక్సలైట్ల సరెండర్ - మావోయిస్టుల ఉనికి మరింత పతనం !
చత్తీస్‌ఘడ్‌లో ఆశన్నతో సహా 208 మంది నక్సలైట్ల సరెండర్ - మావోయిస్టుల ఉనికి మరింత పతనం !
Embed widget