Jagan Tour : ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
Andhra Politics : ఎన్నికలకు సీఎం జగన్ భిన్నంగా ప్రచారం చేయనున్నారు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేసి బహిరంగసభలో పాల్గొననున్నారు.
Jagan Bus journey from Idupula Paya to Ichapuram : ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్ మ్యాప్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు.
మొగచి మూడు రోజుల షెడ్యూల్
ఈ నెల 27 నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర
►ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం
►తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు
►ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్, సాయంత్రం బహిరంగ సభలు
►27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ
►28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ
►30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ
.
బస్సు యాత్ర ప్రారంభానికి ముందు.. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్‌ను సీఎం జగన్ సందర్శిస్తారు. వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్రను మొదలుపెడతారు. మేమంతా సిద్ధం యాత్ర ద్వారా సీఎం జగన్ పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ ఉండనుంది. కడప పార్లమెంట్ స్థానం పరిధి నుంచి జన సమీకరణ చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం పార్లమెంటరీ స్థానాల పరిధిలో మేమంతా బస్సు యాత్ర కొనసాగనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. అలాగే సిద్దం సభలు జరిగిన చోట్ల.. బస్సు యాత్ర, బహిరంగ సభలు ఉండవని స్పష్టం చేసింది. ప్రజలందరితో ఇంటారాక్షన్ కార్యక్రమం ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ జనంలోనే ఉంటారన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ బస్సు యాత్ర ఉంటుందని ఆ తర్వాత ప్రచారాన్ని ఎలా చేయాలన్నది ఖరారు చేసుకుంటున్నారు. ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ రోజు వరకూ బస్సు యాత్ర చేపడతారు. ఇరవై ఏడో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకూ అంటే దాదాపుగా ఇరవై రోజుల పాటు బస్సు యాత్ర చేస్తారు. సిద్ధం సభలు నాలుగు చోట్ల జరిగినందున ఆ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తప్పించి.. మిగిలిన ఇరవై చోట్ల జగన్బస్సు యాత్ర నిర్వహించే అవకాశం ఉంది.