Jogi Ramesh : జోగి రమేష్‌కు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ - కష్టాల్లో ఊరట లభించినట్లేనా ?
YSRCP : మైలవరం ఇంచార్జ్ గా జోగి రమేష్ ను జగన్ నియమించారు. గత ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలనుకున్నా.. పెనుమలూరు టిక్కెట్ ఇచ్చారు జగన్.
Jagan appointed Jogi Ramesh as Mylavaram in-charge : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం ఇంచార్జ్ గా జోగి రమేష్ ను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకన్నారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసిన సర్నాల తిరుపతిరావును తొలగించారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా జగన్ టిక్కెట్ ఇచ్చారు. జడ్పీటీసీగా ఉన్న ఆయన గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. అదే సమయంలో ఆయన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని కూడా తీసేయడం వివాదాస్పదమయింది. చివరికి ఆయనను తప్పించాలని నిర్ణయించుకున్నారు.
మైలవరం నుంచి పోటీ చేయాలనేది జోగి రమేష్ కోరిక
జోగి రమేష్ మొదటి నుంచి మైలవరం నియోజకవర్గంలోనే పని చేసుకునేవారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ప్రతిపక్షంలో ఉంటూ.. ఐదేళ్ల పాటు అదే నియోజకవర్గంలో పని చేసుకున్నాయి. అయితే 2019లో చివరి క్షణంలో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలోకి రావడంతో ఆయనకు మైలవరం టిక్కెట్ ఇచ్చి జోగి రమేష్ ను పెడన నియోజకవర్గానికి మార్చారు. వారిద్దరూ విజయం సాధించారు. అయితే ఆయన పెడన నుంచి మారిపోవాలని మళ్లీ మైలవరం నుంచి పోటీ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ జగన్ మాత్రం ఆయనను పెడన నుంచి మార్చారు కానీ.. మైలవరం చాన్స్ ఇవ్వలేదు.. పెనుమలూరుకు మార్చారు.
ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఓకే: రామ్మోహన్ నాయుడు
పెనుమలూరు టిక్కెట్ ఇచ్చినా గెలవలేకపోయిన జోగి రమేష్
పెనుమలూరులో బోడె ప్రసాద్ చేతిలో జోగి రమేష్ ఘోర పరాజయం పాలయ్యారు. దాంతో ఆయన మళ్లీ తనకు మైలవరం ఇంచార్జ్ పదవి ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టారు. జగన్ ఆయన కోరికను మన్నించారు. పెనుమలూరు నియోజకవర్గానికి మరో నేత దేవభక్తుని చక్రవర్తిని ఇంచార్జ్ గా నియమించారు. ఆయన గత ఎన్నికల్లో పెనుమలూరు టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఇంచార్జ్ అవకాశం లభించింది. పెనుమలూరు నుంచి గతంలో వైసీపీ తరపున పార్థసారధి విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ టీడీపీ తరపున నూజివీడు నుంచి పోటీ చేసి గెలిచారు.
వైఎస్ఆర్‌సీపీలో రాజీనామాల విప్లవం - పెద్ద ఎత్తున రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పే చాన్స్
పాత నియోజకవర్గాలు కోరుకుంటున్న వైసీపీ సీనియర్ నేతలు
వైసీపీలో ఎన్నికలకు ముందు కీలక నేతల నియోజకవర్గాలను మార్పు చేశారు. దాదాపుగా యాభై, అరవై మందిని అటూ ఇటూ మార్చారు. వారెవరూ తమ తమ నియోజకవర్గాల్లో కుదురుకోలేకపోయారు. ఇప్పుడు మళ్లీ పాత నియోజకవర్గాల్లో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారందర్నీ మళ్లీ ఇంచార్జులుగా నియమించేందుకు జగన్ ఆసక్తి చూపడం లేదు. ఓడిపోయిన వారు ఆయా నియోజవవర్గాలకు ఇంచార్జ్ లు గా ఉంటున్నారు. దీంతో కొత్త నియోజవకర్గాలకే ఇంచార్జులుగా ఉంటున్నారు. మార్పు కోసం హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు.