YS Jagan and Sharmila : జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?
Andhra Pradesh: జగన్ షర్మిల మధ్య రాజీ కుదిరిందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సంపూర్ణంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి.

Compromise between Jagan and Sharmila : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజీ చర్చలు కొలిక్కి వస్తూండటమేనని చెబుతున్నారు. ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణం అని ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ కోసం ప్రచారం చేసిన షర్మిల తర్వాత సొంత రాజకీయం ప్రారంభించారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ పెద్దగా ఫలితం ఉండదని అంచనాకు రావడంతో వ్యూహాత్మకంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చేశారు. అప్పట్నుంచి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణంగా నిలిచింది.
ఆస్తుల వివాదంతో ఇద్దరి మధ్య దూరం
అన్నా చెల్లెళ్ల మధ్య ఎందుకు దూరం పెరిగిందన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. అటు జగన్ కానీ ఇటు షర్మిల కానీ తమ మధ్య దూరం పెరగడానికి ఫలానా ఇష్యూ కారణం అని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ పరోక్షంగా షర్మిల చేసిన కామెంట్ల వల్ల వారి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఆ లెక్క తేలకపోవడం, జగన్మోహన్ రెడ్డి ఆస్తిని పంచి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయని అంటున్నారు. ఆ కోపంతోనే షర్మిల రాజకీయ ప్రవేశం చేశారన్న ప్రచారమూ ఉంది. అయితే షర్మిల మాత్రం ఇప్పుడు చాలా సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నంతగా ఓట్లు సాధించకపోయినా ఇప్పుడు యాక్టివ్ గా రాజకీయం చేస్తున్నారు. వైసీపీ కన్నా ఎక్కువగా ఆమె ఫీల్డ్ లో ఉంటున్నారు. ఎవరి రాజకీయం వారు చేసుకుంటున్నారు.
దీపావళి నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం - మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
కాంగ్రెస్‌కు దగ్గరయ్యేలా జగన్ వ్యూహాలు
అయితే ఎన్నికల్లో పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాజీకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే వైసీపీకి అంత మైనస్ అవుతుంది. భవిష్యత్ లో రాబోయే సవాళ్లను తట్టుకోవాలంటే.. కాంగ్రెస్ నుంచి వచ్చే ముప్పును తప్ిపంచుకోవాలని జగన్ అనుకుంటున్నారని అందుకే ఆ పార్టీతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఢిల్లీలో జరిపిన ధర్నాకు కాంగ్రెస్ మద్దతు తెలియచేయలేదు కానీ.. ఇండియా కూడమి సభ్యులంతా వచ్చారు. ఇటీవల ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను జగన్ సమర్థించారు. దీంతో ఆయన కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అియతే ఇక్కడ ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల ఆమోదం లేకపోతే ఆ దిశగా అడుగులు పడటం కష్టమేనంటున్నారు.
ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
సీరియస్‌గా రాజకీయం చేస్తున్న షర్మిల
రాజీ చర్చలు జరుగుతున్నా రాజకీయంగా రాజీ పడేందుకు షర్మిల వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే ముందుగా జగన్ హయాంలో జరిగిన తప్పుల్ని వివరిస్తున్నారు. తర్వాత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన టార్గెట్ ను ఎప్పుడూ మిస్ కానని ఆమె నేరుగా చెబుతున్నట్లవుతోంది. అయితే జగన్ తో ఏ మాత్రం రాజీ పడినట్లుగా కనిపించినా లేదా రాజీ చర్చలు జరుగుతున్నట్లుగా బయటకు వచ్చినా అది తన రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని షర్మిల అనుకుంటున్నారు. ఆస్తుల గొడవను ఎలా పరిష్కరించుకున్నా లేకపోయినా.. తన రాజకీయం మాత్రం ఆగదనే సంకేతాలను షర్మిల ఇస్తున్నారని అనుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

