అన్వేషించండి

Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?

Deputy CM Jada: ఏపీలో దళిత క్రైస్తవ ఓటు బ్యాంక్ చుట్టూ సరికొత్త రాజకీయం హీటెక్కింది. జడ శ్రవణ్ కుమార్ డిప్యూటీ సీఎం కుర్చీపై కర్చీఫ్ వేయడం వెనుక పెద్ద ప్లానే ఉంది.

YSRCP Supporting Jada Shravan Backfiring:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఎన్నికల ముగింపు తర్వాత కూడా తెరవెనుక సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో సుమారు  15% నుండి 18% వరకు  బలంగా ఉంటూ, దశాబ్ద కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన, సహజ సిద్ధమైన ఓటు బ్యాంక్‌గా ఉన్న దళిత క్రైస్తవ సామాజికవర్గం చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ చదరంగం నడుస్తోంది. మొన్నటివరకు జగన్ మోహన్ రెడ్డికి ఏకపక్షంగా అండగా నిలిచిన ఈ వర్గానికి తానే ఏకైక లీడర్నని, రక్షకుడినని చెప్పుకుంటూ  జై భీమ్ భారత్ పార్టీ అధినేత, లాయర్ జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో మంగళగిరితో పాటు పలు స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు చీల్చిన శ్రవణ్.. ఇప్పుడు ఏకంగా తానే దళిత క్రైస్తవుల ప్రత్యామ్నాయ డిప్యూటీ సీఎం అనే రేంజ్‌లో బిల్డప్ ఇస్తూ చేస్తున్న రాజకీయం ఢిల్లీ స్థాయి దాకా చర్చనీయాంశమైంది.

దళిత క్రైస్తవులకు తానే లీడర్నంటున్న జడ శ్రవణ్  

రాజకీయ నిపుణుల లోతైన విశ్లేషణ ప్రకారం.. జడ శ్రవణ్ కుమార్‌కు అత్యంత స్పష్టమైన, సుదూర రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల నిరసన సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు   దీనికి స్పష్టమైన ఉదాహరణ. పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గానికి డిప్యూటీ సీఎం అయితే.. నేను దళిత క్రైస్తవ సామాజికవర్గానికి డిప్యూటీ సీఎంను  అనే తరహాలో శ్రవణ్ క్లెయిమ్ చేసుకోవడం వెనుక.. జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్‌ను పక్కనబెట్టి, సదరు ఓటు బ్యాంక్‌ను తన స్వంత అకౌంట్‌లోకి మార్చుకోవాలనే మైండ్ గేమ్ స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో జోసఫ్ రావణ్‌కు మద్దతుగా జడ శ్రవణ్ పని చేశారు. 

జోసఫ్ రావణ్‌కు జడ శ్రవణ్ అండ  
ఇక్కడే వైసీపీ  ఊహించని పెద్ద పొలిటికల్ షాక్ తగలనుంది. జోసఫ్ రావణ్, జడ శ్రవణ్ కుమార్ వంటి వారు పవన్ కల్యాణ్‌ను, కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని  విమర్శలు చేస్తుంటే..  వైసీపీ  అనుకూల మీడియా వీరికి విపరీతమైన కవరేజ్ ఇస్తూ ప్రమోట్ చేస్తోంది. కూటమిని ఇబ్బంది పెట్టడానికి వీరు పనికొస్తారని జగన్ మోహన్  రెడ్డి భావిస్తుండవచ్చు. కానీ, పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్న నిజం ఏంటంటే.. వీరిని ఎంతగా ప్రోత్సహిస్తే అంతగా వైకాపాకే భారీ నష్టం వాటిల్లుతుంది.  ఎందుకంటే, దళిత క్రైస్తవ సమాజంలో ఒక కొత్త లీడర్‌గా జడ శ్రవణ్ కుమార్ ఎస్టాబ్లిష్ అయితే.. మొదట ఖాళీ అయ్యేది వైసీపీ ఓటు బ్యాంక్ అని గుర్తు చేస్తున్నారు.  

గత ఎన్నికల్లోనే కొంత మేర కాంగ్రెస్ వైపు ఓటర్లు

ప్రస్తుతం ఏపీలో దళిత, మైనారిటీ వర్గాలు వైసీపీ  ఐదేళ్ల పాలనలో తమకు జరిగిన అన్యాయాలు, నిధుల మళ్లింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని గత ఎన్నికలు నిరూపించాయి.  జగన్ మోహన్ రెడ్డి కేవలం ఓట్ల కోసమే తమను వాడుకున్నారనే భావన క్రైస్తవ పెద్దలలో బలంగా నాటుకుంటోంది. అందుకే గత ఎన్నికల్లో కొంత మంది కాంగ్రెస్ కు ఓటు వేశారు.  ఇలాంటి తరుణంలో జడ శ్రవణ్ కుమార్ రూపంలో ఒక దూకుడున్న దళిత న్యాయవాది, క్రైస్తవ హక్కుల రక్షకుడిగా ప్రచారం పొందితే.. ఆ వర్గాల యువత  వైసీపీని వదిలేసి  జై భీమ్ భారత్ పార్టీ  వైపు మళ్లే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. అంటే, కూటమిని దెబ్బతీయడానికి వాడుతున్న ఆయుధమే.. చివరికి  వైసీపీ పునాదులనే తవ్వేసే ప్రమాదం ఉంది.

వైసీపీ మేల్కోని రూటు మార్చాల్సిందే! 

వైసీపీ అనుసరిస్తున్న ఈ విధానం కచ్చితంగా  భస్మాసుర హస్తం  లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  జోసఫ్ రావణ్ అరెస్ట్‌ను, ఉపా   కేసులను బూచిగా చూపిస్తూ జడ శ్రవణ్ కుమార్ చేస్తున్న సెంటిమెంట్ పాలిటిక్స్ వల్ల.. వైసీపీ తన సొంత ఓటు బ్యాంక్‌పై నియంత్రణ కోల్పోతోంది. పవన్ కల్యాణ్ ఐడెంటిటీని ఎదుర్కొనే క్రమంలో,  వైసీపీకి  ప్రత్యామ్నాయంగా దళిత క్రైస్తవ సమాజానికి జడ శ్రవణ్‌ను లీడర్‌గా మార్చే ఈ వ్యూహం.. రాబోయే 2029 ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆయా సామాజికవర్గాల్లో మూడో స్థానానికి పడిపోయేలా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.


  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget